amp pages | Sakshi

Kukatpally:వివాహేతర సంబంధం.. భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య 

Published on Thu, 10/28/2021 - 09:20

సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: వివాహం చేసుకున్న భార్యను వదిలి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్తను బుధవారం భార్య రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని చితక బాదిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌ స్గేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా పెద్దపరిమికి చెందిన ప్రకాష్‌కు 2019లో అదే జిల్లాకు చెందిన త్రివేణితో వివాహం జరిగింది. వివాహం సమయంలో వరకట్నంగా రూ.20 లక్షల నగదు, 30 సవర్ల బంగారు ఆభరణాలు, 3 ఎకరాల భూమి ఇచ్చారు. ప్రకాష్‌ బంజారాహిల్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో చార్టర్డ్‌ అకౌంటెంటుగా పని చేస్తున్నాడు. 
చదవండి: హైదరాబాద్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతి గొంతు కోసిన యువకుడు

ప్రకాష్‌ పెళ్ళైన నెలకే భార్యను దూరం పెట్టడం మొదలు పెట్టాడు. హైదరాబాదులో కాపురం పెట్టాక భార్యను అకారణంగా హింసించే వాడు. రాత్రుళ్లు ఇంటికి రాకుండా ఉండేవాడని బాధితురాలు త్రివేణి తెలిపింది. తనతో అంతరంగికంగా ఉన్న ఫొటోలను తన స్నేహితులకు చూపించేవాడని.. భర్త పెట్టే బాధలను భరించలేక ఆత్మహత్యాయత్నం చేసినా పట్టించుకోలేదని బాధితురాలు పేర్కొంది. కాగా తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలుసుకుంది. బుధవారం రాత్రి త్రివేణి తన కుటుంబ సభ్యులతో కేపీహెచ్‌బీ తులసీనగర్‌లో ప్రకాష్, మరో మహిళతో ఉండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని చితకబాదింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రకాష్‌ను, మహిళను అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషనుకు తరలించారు. 
చదవండి: విషాదం: పెళ్లి విషయంలో ధైర్యం చూపారు.. బతికే విషయంలో తెగువ చూపలేక..

Videos

అంతా మాయ..సేమ్ 2 సేమ్.. 2024 మోదీ ఎన్నికల స్పీచ్ పై డిబేట్

కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం

ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం

పచ్చ మద్యం స్వాధీనం..

బాబును నమ్మే ప్రసక్తే లేదు..

మహిళలపైనా పచ్చమూకల దాష్టీకం..

నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

విజనరీ ముసుగేసుకున్న అవినీతి అనకొండ

విజయవాడలో సాక్షి ప్రజా ప్రస్థానం

పవన్, బాబు, లోకేష్ పై జోగి రమేష్ పంచులు

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)