amp pages | Sakshi

మూడో పెళ్లి.. వివాహిత అనుమానాస్పద మృతి

Published on Mon, 03/08/2021 - 09:16

వైరారూరల్‌: అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని పాలడుగు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పాలడుగు గ్రామానికి చెందిన మాణిగ భాస్కర్‌ అలియాస్‌ బజార్‌ కోదాడ మండల ద్వారాకుంట గ్రామానికి చెందిన శైలజ (27)ను సుమారు ఐదేళ్ల క్రితం మూడో వివాహం చేసుకున్నాడు. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో నిత్యం ఘర్షణ పడుతుండేవారు. దీంతో శైలజ తరచూ పుట్టింటింకి వెళ్తుండేది.

మూడు రోజుల క్రితం కూడా భార్యాభర్తల మధ్య ఘర్షణ జరగడంతో శైలజ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతుకుతున్నారు. కాగా కొందరు రైతులు ఆదివారం పాలడుగు సమీపం నుంచి వెళ్తుండగా బావిలో నుంచి దుర్వాసన వచ్చింది. బావి వద్దకు వెళ్లి గమనించగా శైలజ మృతదేహం కనిపించింది. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు ప్రయత్నించగా.. వారు శనివారం మధ్యాహ్నం వరకు ఇంటికి తాళం వేసి వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)