amp pages | Sakshi

Suryapet: ర్యాగింగ్‌ ఘటనపై విచారణ

Published on Tue, 01/04/2022 - 04:36

సూర్యాపేట క్రైం: సూర్యాపేట మెడికల్‌ కళాశాల బాలుర హాస్టల్‌లో జరిగిన ర్యాగింగ్‌ ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక అందజేయాలని డీఎంఈ రమేశ్‌రెడ్డిని ఆదేశించారు.

ఈ మేరకు సోమవారం సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ దండ మురళీధర్‌రెడ్డి, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సీవీ శారద, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బాబురావుతో పాటు పలువురు అసోసియేట్‌ ప్రొఫెసర్లతో కూడిన కమిటీ, విద్యార్థుల నుంచి ఈ ఘటనకు సంబంధించిన సమాచారం సేకరించింది. అనంతరం ఈ కమిటీ విచారణ నివేదికను సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డికి సమర్పించింది.  (చదవండి: కులమేంటని అడిగి.. సార్‌ అని పిలవాలని హుకుం, గదిలో బంధించి దారుణం)

బాధ్యులందరిపై కేసు నమోదు చేస్తాం.. 
బాధిత విద్యార్థి సాయికుమార్‌ ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ కూడా విచారణ జరిపారు. హాస్టల్‌ను సందర్శించి పలువురు మెడికోలను విచారించారు. కాగా, ర్యాగింగ్‌ ఘటనపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నామని, ప్రస్తుతం ఐదుగురిపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ చెప్పారు. ఇంకా మరికొంతమందిని గుర్తించే పనిలో ఉన్నామని, బాధ్యులైన ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.

గతంలో కూడా కళాశాల వసతి గృహంలో ర్యాగింగ్‌ జరిగినట్లు తెలిసిందని, విద్యా సంస్థలు, వసతిగృహాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, త్వరలో మెడికల్‌ కళాశాల వసతి గృహాల్లో కూడా ర్యాగింగ్‌ను నిరోధించేందుకు విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని వివరించారు.

ఎస్పీ వెంట డీఎస్పీ మోహన్‌కుమార్, సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ శ్రీనివాస్‌ ఉన్నారు. ఇదిలా ఉండగా మెడికల్‌ కళాశాల హాస్టల్‌లో జూనియర్‌ విద్యార్థిపై ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ పలు విద్యార్థి సంఘాల నాయకులు మెడికల్‌ కళాశాల ఎదుట ధర్నా చేశారు. ర్యాగింగ్‌ జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)