amp pages | Sakshi

గ్రేప్స్‌ జిలేబి తయారీ విధానం తెలుసుకోండి..

Published on Sun, 03/27/2022 - 16:59

ఆనియన్‌ కీమా కప్స్‌
కావలసినవి :  కీమా – పావు కిలో (ముందుగా ఉప్పు, కారం, మసాలా వేసుకుని ఉడికించి పెట్టుకోవాలి), ఆనియన్‌ కప్స్‌ – 6 (పెద్ద ఉల్లిపాయను మధ్యలోకి కట్‌ చేసి గుండ్రంగా పెద్దగా ఉండే కప్స్‌ తీసుకుని పెట్టుకోవాలి),గుడ్లు – 7, పాలు – 2 టేబుల్‌ స్పూన్లు, కారం, మిరియాల పొడి – అర టీ స్పూన్‌ చొప్పున, ఉప్పు – కొద్దిగా, నూనె – 2 టేబుల్‌ స్పూన్లు,
కొత్తిమీర తురుము, క్యారెట్‌ తురుము – పావు కప్పు చొప్పున

తయారీ : ముందుగా గుడ్లు, పాలు, కారం, మిరియాలు, ఉప్పు, కొత్తిమీర తురుము, క్యారెట్‌ తురుము ఒకదాని తరవాత ఒకటి వేసుకుని బాగా కలుపుకుని.. వెడల్పు పాన్‌ మీద నూనె వేసుకుని, ఆనియన్‌ కప్స్‌ పెట్టుకుని, అందులో కొద్దిగా గుడ్ల మిశ్రమం వేసుకోవాలి.  నిమిషంలోపే ఒక్కో ఆనియన్‌ కప్‌లో కీమా మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకోవాలి. అనంతరం గుడ్ల మిశ్రమంతో కప్స్‌ నింపుకోవాలి. తర్వాత చిన్న మంట మీద మూత పెట్టి ఉడికించుకోవచ్చు లేదా ఓవెన్‌లో బేక్‌ చేసుకోవచ్చు.

ఐస్‌క్రీమ్‌ బ్రెడ్‌
కావలసినవి:  ఐస్‌క్రీమ్‌ – 1 కప్పు (మీరు మెచ్చే ఫ్లేవర్‌), గోధుమ పిండి, బియ్యప్పిండి – ముప్పావు కప్పు చొప్పున, పంచదార పౌడర్‌ – పావుకప్పు, రైన్‌బో స్ప్రింకిల్స్‌ లేదా చాక్లెట్‌ చిప్స్‌ – అభిరుచిని బట్టి

తయారీ: ముందుగా ఐస్‌క్రీమ్, పంచదార పౌడర్‌ను హ్యాండ్‌ మిక్సర్‌తో బాగా కలుపుకుని.. గోధుమ పిండి, బియ్యప్పిండి కొద్దికొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. అభిరుచిని బట్టి రైన్‌బో స్ప్రింకిల్స్‌ లేదా చాక్లెట్‌ చిప్స్‌ ఆ మిశ్రమంలోనే కలుపుకుని బ్రెడ్‌ బౌల్‌లో వేసుకుని బేక్‌ చేసుకోవచ్చు. లేదా బ్రెడ్‌ బౌల్‌లో ఐస్‌క్రీమ్‌ మిశ్రమం వేసుకుని పైన రైన్‌బో స్ప్రింకిల్స్‌ లేదా చాక్లెట్‌ చిప్స్‌ వేసుకుని బేక్‌ చేసుకోవచ్చు.

గ్రేప్స్‌ జిలేబి
కావలసినవి: మైదా – 1 కప్పు, శనగ పిండి – 1 టేబుల్‌ స్పూన్‌, ద్రాక్ష పళ్లు – 1 కప్పు(మిక్సీపట్టి గుజ్జులా చేసుకోవాలి), గడ్డ పెరుగు, పంచదార – 1 కప్పు చొప్పున,  నీరు – సరిపడా, ఏలకుల పొడి – పావు టీ స్పూన్‌, ఉప్పు – చిటికెడు, ఫుడ్‌ కలర్‌ – కొద్దిగా (గ్రీన్‌ కలర్‌/ అభిరుచిని బట్టి), నెయ్యి – సరిపడా

తయారీ: ముందుగా ఒక పెద్ద బౌల్‌లోకి మైదా పిండి, శనగపిండి, పెరుగు తీసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. అందులో ద్రాక్ష పళ్ల గుజ్జు, చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్‌ ఆన్‌ చేసుకుని, పాలలో పంచదార, అర కప్పు నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. అందులో ఏలకుల పొడి, ఫుడ్‌ కలర్‌ వేసుకుని గరిటెతో తిప్పుతూ తీగ పాకం రాగానే.. స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. మరో కళాయిలో నెయ్యి వేసుకుని.. అందులో ద్రాక్ష–మైదా మిశ్రమంతో జిలేబీలు వేసి.. దోరగా వేగిన వెంటనే పాకంలో వేసుకుంటే సరిపోతుంది.

Videos

తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్

పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు

జగనన్న వెంట ఆ ఇంటి ఆడపడుచు లేకున్నా..మేము ఉన్నాం..

ఒకసారి తిరిగి చూసుకోండి..

బాబు కుట్రలు: సంక్షేమ పథకాల అమలును చంద్రబాబు అడ్డుకుంటున్నారు: అవంతి

చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు

చంద్రబాబుపై విద్యార్థుల కామెంట్స్

30 వేల కోట్ల ఆరోపణలపై పెద్దిరెడ్డి క్లారిటీ..!

జగన్ ప్రచార సభలో ఊహించని రెస్పాన్స్

చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలపై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?