amp pages | Sakshi

Health Tips: పరగడుపున ఇవి తింటే చాలా డేంజర్‌! జాగ్రత్త

Published on Sat, 07/23/2022 - 09:52

మెరుగైన ఆరోగ్యం కావాలంటే.. ఆహారపు అలవాట్లు సరిగ్గా ఉండాలి. ఏ ఆహార పదార్థాలు ఎప్పుడు తినాలనేది తెలుసుకోవాలి. ఎందుకంటే పరగడుపున కొన్ని రకాల పదార్థాలు తింటే అనారోగ్యం పాలవుతారు.

మనం తినే ఆహార పదార్థాలు లేదా తీసుకునే ద్రవపదార్థాలు ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంటాయి. వైద్యనిపుణుల ప్రకారం పరగడుపున కొన్ని రకాల ఆహార పదార్థాల్ని తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల ఆరోగ్యం పూర్తిగా పాడవుతుంది. ఎందుకంటే ఉదయం వేళ కడుపు ఖాళీగా ఉంటుంది.

అటువంటి పరిస్థితుల్లో మనం ఏం తిన్నా అది నేరుగా కడుపు లోపలి భాగాలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా కడుపులో మంట, నొప్పి, ఛాతీలో మంట, అజీర్తి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉదయం వేళ పరగడుపున ఏయే పదార్థాలు తినకూడదో తెలుసుకుందాం.

వేయించిన చిరుతిళ్లు..
ఉదయం వేళల్లో మసాలా లేదా వేయించిన చిరుతిళ్లు తినడం వల్ల కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా కడుపు లేదా ఛాతీ బరువుగా అన్పించి ఇబ్బంది కలుగుతుంది.

అతి వద్దు!
అదే విధంగా పీచు పదార్థాలు కడుపుకి మంచివే. కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం నష్టం చేకూరుస్తాయి. ఫలితంగా కడుపులో నొప్పి, కడుపు పట్టేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే పరిమిత మోతాదులోనే పీచుపదార్థాలు తీసుకోవాలి.

ఛాతీలో మంట..
కొంతమందికి బ్రష్‌ చేసుకోగానే కాఫీ లేదా టీ తాగకపోతే పిచ్చెక్కినట్లు ఉంటుంది. తాగకపోతే ఏ పనీ చేయలేరు. అయితే అలా కాఫీ లేదా టీ తాగడం వల్ల్ల శరీరానికి తీవ్రనష్టం కలుగుతుంది. ఛాతీలో మంట, డీహైడ్రేషన్‌ వంటి సమస్యలు ఎదురవుతాయి.

దానికి బదులు ఉదయం పరగడుపున నీళ్లు తాగడం చాలా మంచిది. అలాగని చల్లటి నీళ్ళు తాగకూడదు. దీనివల్ల జీర్ణ సమస్యలు ఎదురై..ఏం తిన్నా సరే కడుపులో అజీర్ణం మొదలవుతుంది.

పూర్తిగా ప్రమాదకరం
పరగడుపున ఆల్కహాల్‌ తీసుకోవడం పూర్తిగా ప్రమాదకరం. ఇది కాలేయంపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. ఖాళీ కడుపుతో మద్యం పుచ్చుకోవడం వల్ల రక్తంలో ఆల్కహాల్‌ వేగంగా వ్యాపిస్తుంది. దానిమూలంగా రకరకాల అనర్థాలు సంభవిస్తాయి కాబట్టి వీలయినంత వరకు పైన చెప్పుకున్న ఆహారం లేదా ద్రవపదార్థాలను వీలయినంత వరకు పరగడుపున తీసుకోకుండా ఉండటం చాలా మేలు. 

చదవండి: 5 Fruits For Monsoon Diet: జలుబు, దగ్గు.. వర్షాకాలంలో ఈ ఐదు రకాల పండ్లు తిన్నారంటే..!

Videos

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)