amp pages | Sakshi

ఇద్దరు డ్రైవర్లు.. బతుకుబండి ఆగనివ్వం

Published on Wed, 07/07/2021 - 00:01

ఇల్లు నడవడం ముఖ్యం. పిల్లలకు అన్నం పెట్టడం ముఖ్యం. ఇల్లు నడిపించే శక్తి మగవాడికి మాత్రమే ఉండదు. స్త్రీకి కూడా రెండు చేతులు ఉంటాయి. ఒడిస్సాలో ఒక ప్రయివేటు టీచర్‌కు ఉద్యోగం పోయింది కరోనా వల్ల. చెత్త ఎత్తి పోసి వాహనానికి డ్రైవర్‌గా మారింది. ముంబైలో ఒక ఇల్లాలిని భర్త వదిలేసి పోయాడు. మూడో చక్రాల ఆటోను నాలుగు రోడ్ల మీద తిప్పుతోంది. ఓడిపోవద్దు అంటున్నారు వీళ్లు. గెలిచి బతుకును పరిగెత్తించండి అంటున్నారు. ఉపాధులు తారుమారు అవుతున్న కరోనా రోజుల్లో వీరే స్ఫూర్తి.

కాలం కష్టకాలంగా ఉన్నప్పుడు భుజాల్లో శక్తి ఊరుతుంది. లోపలి శక్తి బయటకు వస్తుంది. మనుగడ కోసం మొండి ధైర్యం ఏర్పడుతుంది. నిజమే. ఇప్పుడు కరోనా కాలంలో కుటుంబాన్ని కాపాడుకోవడమే అన్నింటి కన్నా ముఖ్యమైన కర్తవ్యం. భర్త తన శక్తి మేరకు భార్య తన శక్తి మేరకు గత పదిహేను నెలలుగా కాపాడుకుంటూనే వస్తున్నారు. అయితే కొన్ని చోట్ల సవాళ్లు ఎదురవుతాయి. ఆ సమయంలో స్త్రీలు ఆ సవాళ్లకు సమాధానంగా నిలుస్తున్నారు. భువనేశ్వర్‌ (ఒడిశా)కు చెందిన స్మృతిరేఖ ఇందుకు ఉదాహరణ. 29 ఏళ్ల ఈ స్కూల్‌ టీచర్‌ ఇప్పుడు చెత్త ఎత్తే వాహనం డ్రైవర్‌గా మారింది.

ప్రతి పనీ గౌరవనీయమైనదే
స్మృతిరేఖ పొలిటికల్‌ సైన్స్‌లో డిగ్రీ చేసింది. పెళ్లయ్యాక తను నివసించే పతారబండ స్లమ్స్‌లో ప్రైమరీ టీచర్‌గా పని చేసేది. ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్త చిన్న ప్రయివేటు ఉద్యోగి. ఉన్నంత లో బాగానే జీవితం గడుస్తూ ఉంటే హటాత్తుగా కరోనా... ఆ వెంటనే స్మృతిరేఖకు కష్టాలు వచ్చిపడ్డాయి. స్కూలు మూతపడింది. ఆ సంపాదనకు తోడు ఇంట్లో ట్యూషన్లు చెప్పేది. ట్యూషన్‌కు కూడా పిల్లలు రావడం మానేశారు. ఆ కొసరు కూడా పోయింది. భర్తకు సగం జీవితం ఇవ్వడం మొదలెట్టారు. పులి మీద పుట్రలా తండ్రి మరణించడం.. తమ్ముళ్లు చిన్నవాళ్లు కావడం వల్ల పుట్టింటి బరువు కూడా నెత్తి మీద పడింది. ‘ఏం చేయాలి ఇప్పుడు. నెత్తి కొట్టుకుంటే లాభం లేదని ధైర్యంగా చెత్త లారీ ఎక్కా’ అంటుంది స్మృతి రేఖ. 2019లో ఒక స్వచ్ఛంద సంస్థ మురికివాడల్లోని స్త్రీలకు డ్రైవింగ్‌ నేర్పడం ఆమెకు లాభించింది. భువనేశ్వర్‌ కార్పొరేషన్‌ చెత్త సేకరణ బృందాలలో స్త్రీలకు అవకాశం ఇవ్వాలనుకోవడంతో స్మృతి రేఖకు డ్రైవర్‌ ఉద్యోగం దొరికింది. అ..ఆలు దిద్దించిన చేతులతో చెత్తలారీ స్టీరింగ్‌ పట్టుకోవడానికి ఆమె నామోషీ ఫీల్‌ కాలేదు. ‘అన్నం పెట్టే ఏ పనైనా గౌరవనీయమైనదే’ అంటుంది. ‘నా డ్యూటీ పొద్దున 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ వుంటుంది. నాలుగైదు ప్రాంతాల్లో తడి చెత్తను వేరుగా పొడి చెత్తను వేరుగా సేకరించాలి. దానిని వేరు వేరు ప్రాంతాలలో పారబోయాలి’ అని చెప్పింది స్మృతి రేఖ. ఆమెకు ఒరిస్సా వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. 

జగమొండి షిరీన్‌
ముంబైలో ఈకాలంలో ఆటో డ్రైవర్‌ షిరీన్‌ కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దానికి కారణం ఆమె తెల్లటి బట్టల్లో, చలువ కళ్లద్దాల్లో, ఏ మాత్రం బెరుకు లేకుండా, న్యూనత లేకుండా దర్జాగా ఆటో నడపడమే. ఆ ఆటో నడిపి ఆమె తన ముగ్గురు పిల్లలను సాక్కుంటోంది. ‘నన్ను అందరూ దబంగ్‌ లేడీ’ అంటారామె. దబంగ్‌ అంటే మొండి ఘటం అని అర్థం. షిరీన్‌ జీవితమే ఆమెను జగమొండి చేసింది. ఇద్దరు కూతుళ్లు పుట్టాక తల్లిని భర్త విడిచిపెట్టి పోయాడు. ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంటే ఆ భర్త రాచిరంపాన పెడితే ఆత్మహత్య చేసుకుంది. కన్నతండ్రి తిరిగి వచ్చి హడావిడిగా ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేస్తే పెద్ద కూతురును అత్తామామలు విషం పెట్టి చంపారు. షిరీన్‌ భర్త ముగ్గురు పిల్లలు పుట్టాక పారిపోయాడు.

‘ఇంకొకరైతే ఏమయ్యేవారో కాని నేను మాత్రం అస్సలు వెరవలేదు’ అంటుంది షిరీన్‌. ఆమె కొన్నాళ్లు చిన్న బిర్యానీ పాయింట్‌ పెట్టింది. నడవలేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే భర్త ఆటో నడిపేవాడు కాబట్టి ఆటో నడపడం మేలనుకుంది. లోన్‌ తీసుకుని ఆటో ఎక్కింది. అయితే ఆమె అందరిలా బీద ఆటో డ్రైవర్‌ లా కనిపించాలనుకోలేదు. చక్కటి బట్టల్లో మంచిగా తయారయ్యి హుందాగా ఆటో నడపాలనుకుంది. మొదట సాటి మగ ఆటోడ్రైవర్లు ఆమెను అటకాయించారు. ‘నిన్ను చూసి అందరూ సవారీ ఎక్కుతారు. నువ్వు రాకు’ అన్నారు. ఆమెను అడ్డగించడానికి చూశారు. కాని పులిలా వారిని ఎదిరించి ఆటోను ముందుకు దూకించింది. ‘మనం అస్సలు తగ్గొద్దు’ అంటుంది షిరీన్‌. బాలీవుడ్‌ తారలు ఆమె గురించి విని ఆమెను పిలిచి ప్రశంసించడం జరుగుతూ ఉంటుంది.

డ్రైవర్‌ వృత్తి అనేది బాధ్యతతో కూడుకున్నది. పురుషులు ఎంత బాగా ఈ డ్యూటీ చేసినా బద్దకం, తాగుడు, నిర్బాధ్యత వంటి లోపాలు కొందరిలో ఉంటాయి. స్త్రీలు ఈ విషయంలో ఎంతో బాధ్యతతో పనిచేసి ఇవాళ దేశంలో చాలా చోట్ల డ్రైవర్లుగా రాణిస్తున్నారు. కరోనా ఇలాంటి వారి విషయంలో చిన్న బ్రేకు వేయగలిగింది కాని స్టాప్‌బోర్డ్‌ పెట్టలేకపోయింది.ప్రస్తుత కాలంలో వీరిని చూసి మరెందరో తమ జీవితాల స్టీరింగ్‌ను మరింత దృఢంగా పట్టుకునే అవకాశం ఉంది.
– సాక్షి ఫ్యామిలీ 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)