amp pages | Sakshi

Jute Jewellery: ఆకర్షణీయమైన అలంకరణకు ముచ్చటైన నారహారాలు..!

Published on Fri, 10/08/2021 - 11:12

దేవీ నవరాత్రుల సందర్భంగా అతివలు తమ అలంకరణలో గ్రాండ్‌గా కనిపించే ఆభరణాలను మెడనిండుగా ధరించడాన్ని ఇష్టపడుతుంటారు. కొంత అడవి బిడ్డల ఆత్మీయత.. మరికొంత కోవెల ఆరాధన ఈ రెండింటినీ జత కలిపితే రూపొందిన డిజైన్లే జనపనార హారాలు, చోకర్లు. సంప్రదాయ చీరకట్టుకైనా, వెస్ట్రన్‌ డ్రెస్‌కైనా ఈ జనపనార ఆభరణం అందంగా ఆకట్టుకుంటుంది.


జనపనారతో తయారు చేసిన దుస్తులు, తాళ్లు.. ఇతరత్రా వస్తువుల గురించి మనకు తెలిసిందే. కొంతవరకు జనపనార గొలుసుల మీదా ఆలోచన ఉండే ఉంటుంది. కానీ, సంప్రదాయ బంగారు పతకాన్ని గొలుసుకట్టుగా ఉండే హారానికి జత చేస్తే ఎంత అందంగా ఉంటుందో ఈ డిజైన్లను చూస్తే అర్థమైపోతుంది. రంగురంగులుగా వేసుకునే దుస్తుల మీదకు, ఈ తరహా ఫ్యూజన్‌ జ్యువెలరీ మరింత ఆకర్షణీయంగా కళ్లకు కడుతుంది. 


విడిగా నార గొలుసులను తీసుకొని వాటికి బంగారం లేదా వన్‌గ్రామ్‌ గోల్డ్‌ లేదా సిల్వర్‌ లేదా కలపతో తయారుచేసిన పెద్ద పెండెంట్‌ను జత చేస్తే చూడముచ్చటైన హారం అలంకరణకు సిద్ధంగా ఉంటుంది. ఈ హారానికి నప్పే చెవి హ్యాంగింగ్స్‌ను విడిగా తీసుకోవచ్చు. తక్కువ ధరలో కావాలో, వేలల్లో ఖర్చుపెట్టి తయారు చేయించుకోవాలో అది మన ఆసక్తిని బట్టి ఉంటుంది. ఎందుకంటే, వందల రూపాయల నుంచి వేల రూపాయల వరకు వీటి ఖరీదు ఉన్నాయి. విడివిడిగా కావల్సినవి సేకరించుకొని, ఇంట్లోనే ఈ హారాలను తయారు చేసుకోవచ్చు. జనపనార పోగులకు రంగులు అద్ది కూడా వీటికి భిన్నమైన డిజైన్లు తీసుకురావచ్చు.

చదవండి: చర్మసౌందర్యానికి మరింత మేలు చేసే విటమిన్‌ ‘ఎ’ ఆహారం..

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)