amp pages | Sakshi

Crime Story: ఇంట్లోకి ఎలా రాగలిగారో..!

Published on Sun, 04/24/2022 - 14:51

పోలీస్‌ స్టేషన్‌ చేరుకున్నాడు లక్ష్మీకాంత్‌.
‘చెప్పాగా. మీరు వెళ్ళండి’ చెప్పాడు అతడితో వచ్చిన అతను.
బెరుకు బెరుకుగా లోపలికి వెళ్లాడు లక్ష్మీకాంత్‌. అతడు తొలిసారిగా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చాడు.
ఇన్‌స్పెక్టర్‌ని కలిశాడు.
‘చెప్పండి’ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌.
‘నేను లక్ష్మీకాంత్‌... నేను...’ చెప్పుతున్నాడు లక్ష్మీకాంత్‌.
‘ముందు వచ్చిన పని చెప్పండి’ అడ్డుపడ్డాడు ఇన్‌స్పెక్టర్‌.
‘మరండీ’ లక్ష్మీకాంత్‌ తొట్రుబాటు శుభ్రంగా తెలుస్తోంది.
‘ఏమైంది’ ఇన్‌స్పెక్టర్‌ అడిగాడు.
‘మా ఇంట్లో దొంగలు పడ్డారు’ చెప్పాడు లక్ష్మీకాంత్‌.
‘బంగారం నగలు... వెండి వస్తువులు... నగదు పోయాయి’ వెంటనే చెప్పాడు.
‘ఎప్పుడు? ఎలా?’ విచారణ మొదలెట్టాడు ఇన్‌స్పెక్టర్‌.
‘రాత్రి. ఎలా అంటే...’
‘పూర్తిగా వివరంగా చెప్పాలి’ చెప్పారు ఇన్‌స్పెక్టర్‌.
లక్ష్మీకాంత్‌ తంటాలు పడుతున్నాడు. అతడ్నే చూస్తూ, ‘చెప్పండి’ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌  మళ్ళీ. 
‘నేను నా భార్య రమణి ఇక్కడ అంటే విశాఖపట్నంలో ఉంటున్నాం. మా సొంత ఇల్లు, చాలా వరకు మా బంధువులు ఇక్కడే ఉంటున్నారు. అబ్బాయి శ్రీకాంత్‌  ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో, అమ్మాయి శ్రీవల్లి పెళ్లి రీత్యా బెంగుళూరులో ఉంటున్నారు. నేను.. రమణి నిన్న ఉదయం గుంటూరు వెళ్లాం. అక్కడ రమణి అన్నయ్య గుణశేఖర్‌ కుటుంబం ఉంటుంది. వాళ్లింట్లో గుణశేఖర్‌ రెండవ కూతురు భామ పెళ్ళికి ముహూర్తం తీసే కార్యక్రమం కావడంతో మేము వెళ్లాం.

అక్కడ పని కాగానే బయలుదేరి ఉదయం తిరిగి ఇంటికి వచ్చాం. మెయిన్‌ గేట్‌ తలుపు తాళం తీసుకొని ఇంట్లోకి వెళ్లాం. గదిలోకి వెళ్తే బీరువా తెరిచి ఉంది. దానిలో దాచిన నగలు, నగదు కనిపించడంలేదు. మేము వెళ్లేటప్పుడు గడియ పెట్టిన పెరటి వైపు తలుపు దగ్గరగా మూసి ఉంది. ఆ గడియ మాత్రం తీసి ఉంది. మా హైరానాకి ఇరుగు పొరుగు వారు వచ్చారు.
మా పొరుగాయన ఎకాఎకీన లాక్కొస్తేనే నేను మీ దగ్గరకి వచ్చాను. ఆయన బయటే ఉండిపోయాడు. పోలీసులంటే భయమట’
తలాడిస్తూ ఇన్‌స్పెక్టర్‌  ‘మీకు అనుమానాలేమైనా ఉన్నాయా’ అడిగాడు.
‘దొంగలు ఇంట్లోకి ఎలా రాగలిగారో తెలియడం లేదండీ’ 
‘లక్ష్మీకాంత్‌గారూ అది మేము తేలుస్తాం. నేను తెలుసుకోవాలనుకుంటుంది దొంగతననాకి కారకులు వీరై ఉండొచ్చు అన్న అనుమానితులు ఎవరైనా మీ దృష్టిలో ఉన్నారా అని’ ఆగాడు ఇన్‌స్పెక్టర్‌.
లక్ష్మీకాంత్‌ అయోమయమయ్యాడు. తల గొక్కున్నాడు.
నిముషం తర్వాత –
‘బీరువాలో నగలు, నగదు సర్దడం మాతో పాటు మా ఇంటి పని మనిషి కాంతానికీ తెలుసు’ చెప్పాడు లక్ష్మీకాంత్‌.
‘ఆ కాంతం మీతో పాటే ఉంటుందా?’ వెంటనే ఇన్‌స్పెక్టర్‌ అడిగాడు.
‘లేదు. కాంతం కుటుంబం మాకు దగ్గరలోనే ఉంది. కాంతం మాత్రం ఉదయం ఆరింటికి వస్తుంది. రాత్రి ఎనిమిది వరకు మాతోనే ఉంటుంది. తన రోజు వారీ టిఫిన్, భోజనాలు మాతోనే చేస్తుంది. నా భార్య అనారోగ్యం కారణంగా కాంతాన్ని ఇంటి, వంట పనులకి నియమించాను’ లక్ష్మీకాంత్‌ చెప్పుతున్నాడు.
‘కాంతం మీద మీకు అనుమానమా?’ ఠక్కున అడిగాడు ఇన్‌స్పెక్టర్‌.
‘ఏమో. కాంతం నమ్మకస్తురాలుగా తిరిగేది’ లక్ష్మీకాంత్‌ గొంతు వణుకుతోంది. 
‘మీరు ఊరు వెళ్లేక కాంతానికి ఇంటి పనులు ఏమైనా చెప్పారా. కాంతానికి ఇంటి తాళాలు ఏమైనా ఇచ్చారా’ అడిగాడు ఇన్‌స్పెక్టర్‌.
‘లేదు. కానీ బీరువా తాళాలు బీరువా వెనుక గోడ మేకుకి పెట్టేశాం ఎప్పటిలాగే’
‘కాంతానికి అలా మీరు తాళాలు పెట్టడం తెలుసా? మీరు ఎప్పుడు వచ్చేది కూడా కాంతానికి తెలుసా?’ ఇన్‌స్పెక్టర్‌ అడిగాడు. 
‘తనకి అన్నీ తెలుసు. ఈ రోజు ఉదయం ఏడు ఎనిమిది మధ్య తిరిగి వచ్చేస్తామని కాంతానికి చెప్పాం’ అన్నాడు లక్ష్మీకాంత్‌.
ఇన్‌స్పెక్టర్‌ తన రిస్ట్‌ వాచీ వైపు చూసుకున్నాడు.
‘పదవుతోంది. మరి కాంతం మీరు చెప్పిన టైమ్‌కి మీ ఇంటికి వచ్చిందా? అన్నట్టు మీరు ఎన్ని గంటలకి వచ్చారు?’ 
‘బస్సులో వచ్చాం. ఆలస్యమైంది. మేము ఇంటికి చేరేసరికి తొమ్మిది దాటింది’ చెప్పాడు లక్ష్మీకాంత్‌.
‘మీ కంప్లయింట్‌ పేపరు మీద రాసి ఇవ్వండి. తదుపరి చర్యలు చేపడతాం’
లక్ష్మీకాంత్‌ ఆ పనికి తటపటాయిస్తుండగా అతడి సెల్‌ఫోన్‌ రింగయ్యింది.
‘చెప్పు’ అన్నాడు. అటు రమణి.
‘కంప్లయింట్‌ ఇచ్చేశారా?’ సర్రున అడిగింది రమణి.
’ఆ.. లేదు. ఇంకా లేదు’ తడబడుతున్నాడు లక్ష్మీకాంత్‌.
‘అయ్యో...! ఏమిటి మీరు చేస్తుంది? నాతో చెప్పకుండా పొరుగాయన లాక్కుపోతే స్టేషన్‌కి పోవడమేనా? ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. కంప్లయిట్‌ ఇవ్వకండి. వచ్చేయండి’ గట్టిగానే చెప్పింది రమణి.
నీళ్లు నములుతున్నాడు లక్ష్మీకాంత్‌. ఇన్‌స్పెక్టర్‌ వైపు చూపు తిప్పాడు.
అప్పటికే లక్ష్మీకాంత్‌ చేష్టల్ని ఇన్‌స్పెక్టర్‌ గమనిస్తూ ఉన్నాడు.
‘ఏమైంది?’ అడిగాడు.
లక్ష్మీకాంత్‌ తలని అస్థిరంగా ఆడించి ‘సరే రమణీ.. కంప్లయింట్‌ ఇవ్వను. నేను వచ్చేస్తాను’ అంటూ ఆ ఫోన్‌ కాల్‌ని కట్‌ చేసేశాడు. ఇన్‌స్పెక్టర్‌నే చూస్తున్నాడు.
‘చెప్పండి.. ఏం జరుగుతోంది? అటు మాట్లాడింది ఎవరు?’ టకటకా అడిగాడు ఇన్‌స్పెక్టర్‌.
లక్ష్మీకాంత్‌ వెంటనే చెప్పలేకపోయినా ఇన్‌స్పెక్టర్‌ గుచ్చి గుచ్చి అడగడంతో –
‘నా భార్య. కంప్లయింట్‌ ఇవ్వొద్దంటుంది. నన్ను వచ్చేయమంటుంది’ చెప్పేశాడు.
‘వాట్‌ వాట్‌’ రియాక్టయ్యాడు ఇన్‌స్పెక్టర్‌.
‘బిలబిలా పోగైన వాళ్ళు తలో మాటతో నన్ను తొందర చేయడంతో నేను ఇలా వచ్చేశాను’ నొచ్చుకుంటున్నాడు లక్ష్మీకాంత్‌.
‘బాగుంది. బాగుంది. జరిగింది చాలా పెద్ద నష్టం. ఇక్కడ మీ భార్య అభిప్రాయం ఏమిటి? ఎందుకు? ఆ’ ఇన్‌స్పెక్టర్‌ చిరాకవుతున్నాడు.
లక్ష్మీకాంత్‌ హైరానా పడుతున్నాడు.
అతడ్ని ఇన్‌స్పెక్టర్‌ చిత్రంగా చూస్తున్నాడు.
‘నేను ఇంటికి వెళ్ళిపోతాను. కంప్లయింట్‌  ఇవ్వను’ చెప్పేశాడు లక్ష్మీకాంత్‌.
‘అవునా. అది మీ ఇష్టం. సరే. ఈ మాత్రం మీరు ఓరల్‌గా చెప్పింది మాకు చాలు. కావాలనుకుంటే మేము మా వైపు పని మొదలు పెట్టవచ్చు’ సూటిగా మాట్లాడేడు ఇన్‌స్పెక్టర్‌.
లక్ష్మీకాంత్‌ గింజుకుంటూనే –
‘నేను నా భార్యతో మాట్లాడి వస్తాను’ ఎలాగో చెప్పగలిగాడు.
‘నేనేమీ మిమ్మల్ని ఆపలేదే’ ఇన్‌స్పెక్టర్‌ సీరియస్‌గా ఉన్నాడు.
లక్ష్మీకాంత్‌ మెల్లిగా లేచాడు. బయటికి నడిచాడు.
లక్ష్మీకాంత్‌ చేష్టలకి ఇన్‌స్పెక్టర్‌లో కుతూహలం, అనుమానం పొడచూపాయి.
దారిలో తనతో వచ్చిన పొరుగింటతనితో ఏమీ మాట్లాడక లక్ష్మీకాంత్‌ ఇంటికి చేరిపోయాడు.
ఇంట్లో కొద్ది మందే ఉన్నారు. కాంతం కూడా ఉంది.
లక్ష్మీకాంత్‌ నేరుగా రమణిని చేరి ఆమెను తనతో గదిలోకి తీసుకుపోయాడు.
‘పోలీస్‌ కంప్లయింట్‌ వద్దనుకున్నాంగా’ ఠక్కున అంది రమణి.
‘అవును... కానీ... ’ లక్ష్మీకాంత్‌ ఇంకా తంటాల్లోనే ఉన్నాడు.
‘ఇప్పుడు మనం ఏం చేయాలి?’ విసురుగా అడిగింది రమణి.
అప్పటికే అక్కడకి చేరిన ఇన్‌స్పెక్టర్, ‘నేను తేలుస్తాగా’ అన్నాడు.
లక్ష్మీకాంత్‌ దంపతులు గతుక్కుమన్నారు. ఇన్‌స్పెక్టర్‌ని చూస్తూ నోట మాట రాక ఉండిపోయారు.
ఆ వచ్చిన ఇన్‌స్పెక్టర్‌ తన సహచరుల సహాయంతో తన చర్యల్ని ముమ్మరం చేశాడు.
గంట గడవక ముందే ఆ కేస్‌ను ఒక కొలిక్కి తెచ్చేశాడు.
‘మీ పిల్లలకి తెలియకూడదని మీ ఇద్దరూ కూడబలుక్కుని ఏ మాత్రం ఏమిటి మీ గుణశేఖర్‌కి ముట్టచెప్పేశారు?’ అడిగాడు ఇన్‌స్పెక్టర్‌.
లక్ష్మీకాంత్, రమణిలు మాట్లాడం లేదు.
‘మీ పిల్లలకు నగలు, నగదు దొంగతనంలో పోయాయని నమ్మంచడానికి మీరు ప్లాన్‌ చేయడం భలేగా ఉంది’ నవ్వేడు ఇన్‌స్పెక్టర్‌.
లక్ష్మీకాంత్, రమణి మొహాలు చూసుకున్నారు.
‘పెరటి వైపు నుండి దొంగలు దొంగతనం చేసినట్టు నమ్మించడానికి ఇటు తలుపు గడియ తీసి పెట్టారా. అబ్బో. హు. మీ అడ్డ దారే మిమ్మల్ని అడ్డంగా దొరకపుచ్చింది’ చెప్పాడు ఇన్‌స్పెక్టర్‌.
‘మా అన్నయ్య బాగా చితికిపోయాడు ...’ రమణి చెప్పుతోంది.
‘అవునవును’ అన్నాడు లక్ష్మీకాంత్‌.
‘అందుకు చనిపోయిన నీ మొదటి భార్య పిల్లల్ని మోసం చేస్తావా లక్ష్మీకాంత్‌!  నీ రెండో భార్య రమణి మీద నీకు బోలెడు అనురాగం ఉండొచ్చు. కానీ మరీ ఇంత బ్లండర్‌గా దానిని ప్రెజెంట్‌ చేయకూడదు’ చెప్పుతున్నారు ఇన్‌స్పెక్టర్‌.
లక్ష్మీకాంత్‌ భయం తెలుస్తుంది.
‘నీ కడుపు పిల్లలు కాకపోయినా వాళ్ళు నీ భర్త పిల్లలే కదమ్మా రమణి!’  
రమణి అలజడి తెలుస్తోంది.
‘మంచి పనిని నిర్భయంగా చేపట్టాలి. లేకపోతే అది ఎంత మంచిదైనా వ్యర్థమే. 
తగ్గ శిక్ష అనుభవించక తప్పదు’
లక్ష్మీకాంత్, రమణి తలలు దించుకున్నారు.

-బివిడి ప్రసాదరావు
  


 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)