amp pages | Sakshi

Influencers: పేరుకు పేరు.. చెప్పుకోదగ్గ ఆదాయం.. !

Published on Wed, 03/09/2022 - 09:41

ఇప్పుడు మచ్చుకు రెండు సంభాషణలు... ‘చదువు పూర్తయింది కదా, కీర్తి ఇప్పుడు ఏం చేస్తుంది?’ ‘ఆ అమ్మాయికేం, ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారింది’
‘ఉద్యోగం చేయను’ అంటున్నాడు శ్రీకర్‌. ‘మరి ఏం చేస్తాడట?’ ‘ఖాళీగా ఏమీ కూర్చోలేదు. ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఫుల్‌బిజీలో ఉన్నాడు’
∙∙ 
‘ఇన్‌ఫ్లుయెన్సర్‌ అనే మాట మనకు కొత్త కాదు. అయితే ‘జెన్‌ జడ్‌’ ఇన్‌ఫ్లుయెన్సర్‌ వేరు. ఇంతకీ ఎవరు వీరు?ఒక ఉత్పత్తికి మార్కెట్‌లో ప్రాచుర్యం కలిగించడానికి, నలుగురి దృష్టిని ఆకర్షించేలా మాట్లాడటానికి‘సెలబ్రిటీ హోదా’తో పనిలేదని ఇన్‌ఫ్లుయెన్సర్‌లు రుజువు చేస్తున్నారు.

తమ క్రియేటివిటీతో సోషల్‌ మీడియాలో వెలిగిపోతున్న యూత్‌ ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్‌లుగా సరికొత్త అవతారం ఎత్తుతున్నారు. ఒక ప్రాడక్ట్‌కు తమ మాటల చాతుర్యంతో ప్రాచుర్యం కలిపించడమే వీరి పని. దీనిద్వారా చెప్పుకోదగ్గ ఆదాయం గడిస్తున్నారు. మైక్రో–సెలబ్రిటీలుగా పేరు తెచ్చుకుంటున్నారు.

‘గతంతో పోల్చితే బ్రాండ్‌లను ప్రమోట్‌ చేయడానికి కంపెనీలు యూత్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి’ అంటున్నారు కన్జ్యూమర్‌ మార్కెట్‌ విశ్లేషకులు హర్ష.

ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌ విజయసూత్రం ఏమిటి? ట్రెండ్‌ ఏమిటో తెలిసి ఉండడమే కాదు, దానికి భిన్నంగా ఆలోచించి కొత్తగా ఎలా ఆకట్టుకోవాలో తెలిసుండాలి. కొన్ని డిజిటల్‌ మార్కెటింగ్‌ సంస్థలు చేసిన అధ్యయనంలో ట్రెడిషనల్‌ సెలబ్రిటీల కంటే, యువ ఇన్‌ఫ్లుయెన్సర్‌ల మాట వినడానికి టీనేజర్స్‌ అధిక ఆసక్తి చూపుతున్నారని తేలింది. ఏదో గాలివాటంగా గోదాలోకి దిగడం అని కాకుండా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా తమను తాము మెరుగుపరచుకోవడానికి కృషి చేస్తుంది యువత.

‘ఏ సబ్జెక్ట్‌లో నా బలం ఉంది’‘ఏ ప్లాట్‌ఫామ్‌ అయితే బాగుంటుంది?’
‘టార్గెట్‌ ఆడియన్స్‌ ఎవరు?’‘ఏ తరహా కంటెంట్‌ను క్రియేట్‌ చేయాలి? 

‘ఇతర ఇన్‌ఫ్లుయెన్సర్‌లతో ఎలా కొలాబరేట్‌ కావాలి? ఇతర కమ్యూనిటీల నుంచి ఫ్యాన్స్‌ బలాన్ని ఎలా పెంచుకోవాలి?
‘సోషల్‌ మీడియలో స్ట్రాటిజికల్‌గా ట్రాఫిక్‌ ఎలా జెనరేట్‌ చేయాలి?’... ఇలా ఎన్నో విషయాల్లో తమను తాము తీర్చిదిద్దుకుంటున్నారు.

‘ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌లోని బ్యూటీ ఏమిటంటే ఎవరైనా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారవచ్చు!’ అనే నానుడి కాని నానుడి ఉంది. అలా అని మాయ చేసి  ఫేక్‌ఫాలోవర్స్‌తో సక్సెస్‌ కావడానికి లేదు. కచ్చితంగా శాస్త్రీయ ప్రమాణాలు పాటించాల్సిందే. ‘హై లెవల్‌ ఆఫ్‌ ట్రస్ట్‌’ ఇన్‌ఫ్లుయెన్సర్‌ గెలుపులో కీలకం అవుతుంది.

తమకు కావల్సిన ఇన్‌ఫ్లుయెన్సర్‌లను వెదికి పట్టుకునేంత టైమ్‌ కంపెనీలకు ఉండడం లేదు. దీంతో నికార్సయిన ఇన్‌ఫ్లుయెన్సర్‌ల ఎంపికలో క్లియర్, ట్రాకర్, హైపర్‌... మొదలైన ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ల సహాయం తీసుకుంటున్నారు. అందుకే ఇన్‌ఫ్లుయెన్సర్‌ల విషయంలో వీటిని గ్రేట్‌ స్టార్టింగ్‌ పాయింట్స్‌గా చెబుతున్నారు.

చదవండి: ఎంత మంచి మనసమ్మా నీది.. తమ్ముడికి పెళ్లి చేసి.. తల్లి కోసం తను మాత్రం..
మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతో మంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఉన్న సంగతి తెలిసిందే.


  

Videos

పచ్చ మందపై విరుచుకుపడ్డ సీఎం జగన్ దద్దరిల్లిన నగరి...

Watch Live: పుత్తూరులో సీఎం జగన్ ప్రచార సభ

నేనంటే భయమెందుకు బాబు

జనం జాగ్రత్త.. వీళ్లు మామూలోళ్లు కాదు

పిఠాపురం వంగా గీత అడ్డా.. పవన్ కళ్యాణ్ కి మాస్ కౌంటర్ సాక్షి

వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..

వివేకా కేసు..కోర్టులో సునీతకు ఎదురుదెబ్బ..

లోకేష్ కి ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్

చంద్రబాబు దోచిన సొమ్ము అంతా ప్రజలదే..

ప్రత్యేక హోదా కూడా అమ్మేశారు

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)