amp pages | Sakshi

చండ్ర పుల్లారెడ్డి: అవిశ్రాంత వీరునికి జోహార్లు

Published on Wed, 11/23/2022 - 12:03

దేశం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచ ఆకలి సూచిలో దయనీయ స్థానంలో దేశం కనిపిస్తోంది. ప్రజాస్వామ్యం పేరిట నోట్లస్వామ్యం, రాజకీయాల్లో మతోన్మాదం రాజ్యమేలుతున్నాయి. పాలక పక్షం  ప్రతిపక్షాల్ని సైతం తొక్కిపడ్తూ కాళ్లు, చేతులు ఆడనివ్వడం లేదు.  అధికారం అనేది నియంతృత్వానికి సోపానమవుతుండగా విప్లవ ప్రతి పక్షం రోజూ నెత్తురోడుతున్నది. ప్రత్యామ్నాయ రాజకీయ విశ్వాసాలు సైతం బందీ అవుతున్నాయి.
 
ప్రత్యామ్నాయ ప్రజా ప్రతిపక్షం అంతా ఒక శక్తిగా ముందుకొచ్చే తరుణంలో నవంబర్‌ మాసానికి ఒక ప్రత్యేకత ఉన్నది. విప్లవ శక్తుల ఐక్యతా కృషిలో నిమగ్నమై ఉన్న కామ్రేడ్‌ చండ్ర పుల్లారెడ్డి 1984 నవంబర్‌ 9న కలకత్తాలో గుండె పోటుతో అమరులయ్యారు. 

1917లో కర్నూలు జిల్లా వెలుగోడు గ్రామంలో జన్మించిన చండ్రపుల్లారెడ్డి భూస్వామ్య కుటుంబ వారసత్వాన్ని కాలదన్నాడు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో గెలిచిన బూర్జువా శాసన సభ్యత్వ హోదాను త్యజించి, 50వ ఏట గోదావరిలోయ అడవిలోకి అడుగుపెట్టాడు. 66వ ఏట ఉద్యమంలోనే చివరిశ్వాస వదిలాడు. 

ఇదే మాసంలో విప్లవ సింహంగా పేరుగాంచిన కామ్రేడ్‌ పొట్ల రామనర్సయ్య, విప్లవ ఉపాధ్యాయుడు నీలం రామచంద్రయ్య, విప్లవ విద్యార్థి నాయకుడు జంపాల చంద్రశేఖర్‌ ప్రసాద్, విప్లవ నాయకురాలు రంగవల్లి, కిషన్‌జీలతో పాటు ఎందరో తమ అమూల్యమైన ప్రాణాలర్పించారు. సామాజిక విప్లవకారుడు జ్యోతిబా పూలే నవంబర్‌ 26న అమరులైనారు. వీరంతా ఒక మనిషిని వేరొక మనిషి దోపిడి చేయని సమాజం కావాలన్నారు. వారందరికీ విప్లవ జోహార్లు అర్పిస్తూ జరిగే సంస్మరణ సభను జయప్రదం చేయాలని కోరుతున్నాము.

– డేగల రమ, (రుద్రారం) తెలంగాణ
– రమణారెడ్డి, (బొల్లవరం) ఏపీ అమరుల స్మారక కమిటీ
(నేడు హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంస్మరణ సభ)

 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)