amp pages | Sakshi

కరోనా: అమెరికాలో డెడ్లియెస్ట్‌‌ డే..

Published on Thu, 12/10/2020 - 20:01

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. మహమ్మారి కోవిడ్ ధాటికి అగ్రరాజ్యంలో బుధవారం ఒక్కరోజే 3124 మంది మృతి చెందారు. ప్రాణాంతక కరోనా ప్రబలిన నాటి నుంచి అమెరికాలో ఒక్కరోజే ఈ స్థాయిలో కోవిడ్‌ మరణాలు సంభవించడం ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో వచ్చే నాలుగు వారాల్లో సుమారు 24 వేల మంది కరోనాతో మత్యువాత పడే అవకాశం ఉందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) అంచనా వేసింది.  ఇక నిన్న ఒక్కరోజే కొత్తగా 2,21,267 పాజిటివ్‌ కేసులు వెలుగులోకి రాగా.. దేశవ్యాప్తంగా కరోనాతో ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య  106,688కి చేరింది. గత రెండు వారాలతో పోలిస్తే కోవిడ్‌ కేసుల్లో 18 శాతం మేర పెరుగుదల నమోదైంది. 

ఓవైపు మహమ్మారి అంతకంతకూ ఉధృతమవుతున్న వేళ కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లో ఐసీయూ బెడ్స్‌ కొరత ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రాణాంతక వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో కోవిడ్‌ నిబంధనలు పాటించాల్సిందిగా అమెరికా ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కరోనా నిరోధక వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేంతవరకు మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి పేర్కొంది. (చదవండి: వ్యాక్సిన్‌ మొదట మాదేశానికి కావాలి : ట్రంప్‌)

కాగా కరోనా వైరస్‌ కారణంగా అమెరికాలో ఇప్పటివరకు సుమారు 2,88,000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇక  కరోనా వ్యాక్సిన్‌ మొదట తమ దేశానికే కావాలని డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన కీలక ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. కాగా ఆది నుంచి ట్రంప్‌ యంత్రాంగం వైరస్‌ ప్రభావాన్ని తక్కువగా అంచనా వేసినందు వల్లే దేశంలో విపత్కర పరిస్థితులు తలెత్తాయంటూ డెమొక్రాట్లు ఆరోపించిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ఓటమిపై కరోనా సంక్షోభం బాగానే ప్రభావం చూపింది. డెమొక్రాట్‌ అభ్యర్థి జో బైడెన్‌ గెలుపునకు దోహదం చేసిన ప్రధానాంశాల్లో ఇది కూడా ఒకటి. 
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)