amp pages | Sakshi

ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్లమంది ఎన్‌ఆర్‌ఐలు

Published on Fri, 12/18/2020 - 07:50

విశ్వవ్యాప్తంగా అధిక సంఖ్యలో పెరుగుతున్న వలసలను పరిశీలించి  ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ, 1990 డిసెంబర్‌ 18న జరిగిన సమావేశంలో ‘వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ’ గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దాని మేరకు డిసెంబర్‌ 18ని అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంగా  ప్రకటించింది. వలస అంటే బతుకుదెరువు కోసం, లేదా ఆర్థికాభివృద్ధి కోసం చేసుకునే ‘నివాస మార్పు‘గా భావించవచ్చు. ప్రజలు వలసలతో పలు అవకాశాలను పొందగలుగుతున్నప్పటికీ కష్టాలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. వలసలకు ఎన్నో కారణాలు ఉన్నాయి. వలస వెళ్లేలా ‘నెట్టివేయబడే’ పరిస్థితులు కొన్నైతే, వున్నచోట పరిస్థితులు అనుకూలంగా లేక మరొక చోట ‘ఆకర్షణీయంగా’ ఉండడం మరొక కారణం. చదవండి:డాక్టర్‌ ఫస్ట్‌ లేడీ అంటే తప్పేంటి!?

పని కోసం, బతుకుదెరువు కోసం పల్లెల నుంచి పట్టణాలకు, నగరాలకు గానీ, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి గానీ  వలస వెళ్లడాన్ని ‘అంతర్గత వలసలు’ అంటారు. ఒకదేశం నుంచి మరొకదేశానికి వెళ్లడాన్ని ‘అంతర్జాతీయ వలసలు’ అంటారు. ప్రవాసులకు రాయితీలు కల్పిస్తూ వారిని ప్రాత్సహిస్తే అభివృద్ధి సాధించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 130కి పైగా దేశాలలో 3 కోట్లమంది ప్రవాస భారతీయులు నివసిస్తున్నారని అంచనా. తెలంగాణ ప్రాంతం నుంచి 1970లో వలసలు ప్రారంభమయ్యాయి. అప్పుడే గల్ఫ్‌ దేశాల్లో పెట్రోల్‌ నిల్వలు బయటపడటంతో అక్కడ కూలీల అవసరం ఏర్పడింది.

ఇక్కడ బతుకు దెరువులేని రైతులకు, వ్యవసాయ కూలీలకు అక్కడ మంచి అవకాశం దొరికింది. పొట్టకూటి కోసం వెళ్లిన వలస కార్మికులకు అక్కడి, ఇక్కడి ప్రభుత్వాలు అండగా ఉండాలి. తమ ఉనికిని కాపాడుకుంటూ, మాతృదేశంపై మమకారం చూపుతూ మరెందరికో సహకారాన్ని అందిస్తున్న, ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని.. అనే మాటను నిజం చేయాల్సిన బాధ్యత కూడా ప్రవాసుల మీదవుంది. – రఘుపతిరావు గడప మొబైల్‌ : 99634 99282

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌