amp pages | Sakshi

101 ఏళ్ల తండ్రి మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచిన కుమారుడు.. 18 నెలలుగా

Published on Fri, 05/12/2023 - 14:22

అమ్‌స్టర్‌డ్యామ్‌: నెదర్లాండ్స్‌కు చెందిన ఓ వ్యక్తి తన తండ్రి మృతదేహాన్ని 18 నెలలుగా ఫ్రీజర్‌లో దాచాడు. అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఇతడు ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. ఇతను కూడా వృద్ధుడే కావడం గమనార్హం. వయసు 82 ఎళ్లు.

ఇన్ని నెలలుగా తండ్రి మృతదేహాన్ని ఇంట్లోనే ఎందుకు దాచావని పోలీసులు అతడ్ని ప్రశ్నించారు. అయితే తన తండ్రిని చాలా మిస్ అవుతానని, ఆయనతో మాట్లాడలేకుండా తాను ఉండలేని కుమారుడు బదులిచ్చాడు. అందుకే మృతదేహాన్ని ఫ్రీజర్‌లో ఉంచి రోజు ఆయనతో మాట్లాడుతున్నానని, ఫలితంగా మరోధైర్యాన్ని పొందుతున్నానని తెలిపాడు.

అయితే తండ్రి ఎలా చనిపోయాడు అనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆయన మృతికి సంబంధించి కుమారుడిపై ఎలాంటి అనుమానాలు లేవని చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేసి చెప్పడంతో ఫ్లాట్‌కు వచ్చి చెక్ చేసినట్లు వివరించారు. కాగా.. ఈయన తండ్రి చాలా ఏళ్లుగా ట్యూమర్‌తో బాధపడుతున్నాడని, తరచూ ఆస్పత్రికి కూడా వెళ్తారని పొరుగింటి వారు చెప్పారు.

మరోవైపు కుమారుడి వయసు కూడా 82 ఏళ్లు కావడంతో అతను సరిగ్గా నడవలేకపోతున్నాడని పోలీసులు తెలిపారు. ఇల్లు మొత్తం చెల్లాచెదురుగా ఉందని, వస్తువులు కూడా సరిగ్గా సర్దుకోలేదని పేర్కొన్నారు. ముందు ఇల్లు సర్దుకోవాలని అతనికి వారం రోజులు గడువు ఇచ్చారు. అతను స్వతహాగా తన పనులు చేసుకునే స్థితిలో ఉన్నట్లు కూడా కన్పించడం లేదని, ఇతరుల సాయం కావాల్సి వస్తుందేమోనని పోలీసులు చెప్పారు. వారం రోజుల తర్వాత విచారణ కొనసాగిస్తామన్నారు.

కాగా.. నెదర్లాండ్స్‌లో 2015లో కూడా ఓ వ్యక్తి తన తల్లి మృతదేహాన్ని రెండేళ్లపాటు ఫ్రిజ్లోనే దాచాడు. ఆమెకు వచ్చే పింఛను కోసం ఇలా చేశాడు. ఆ తర్వాత పోలీసులకు దొరకడంతో రూ.36 లక్షలు (40వేల యూరోలు) జరిమానా చెల్లించాడు.
చదవండి: నూరేళ్ల పంటలో.. ఎన్నో వింతలు.. పెళ్లిళ్లు జరిగినా లేటు వయసులోనే! 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)