amp pages | Sakshi

దగ్గు, తుమ్ము, నీరసంతో బాధపడుతున్న సింహాలు

Published on Wed, 11/10/2021 - 11:07

సింగపూర్‌: సింగపూర్‌ జంతుప్రదర్శనశాలలోని నాలుగు ఆసియా సింహాలకు కోవిడ్‌ -19 పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు వైల్డ్‌లైఫ్ గ్రూప్‌లోని పరిరక్షణ, పరిశోధన, వెటర్నరీ వైస్ ప్రెసిడెంట్, జూ ఆపరేటర్ అయిన డాక్టర్ సోంజా లూజ్ పేర్కొన్నారు. తాజాగా సింగపూర్‌ దేశంలో  సుమారు 3,397 కేసులు ఉన్నాయని దేశం మొత్తంగా చూస్తే సుమారు 2 లక్షలకు పైగా కేసులు ఉన్నట్లు సింగపూర్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

(చదవండి: చావు నోట్లో నుంచి కాపాడిన ‘సమయస్ఫూర్తి’)

ఈ నేపథ్యంలోనే సింగపూర్‌ ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ అయిన నైట్ సఫారీ జంతుప్రదర్శనశాలలోని నాలుగు ఆసియా సింహాలకు కరోనా వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అదీ కాక సింహాల్లో గత రెండు రోజులుగా దగ్గు, తుమ్ములు, నీరసంతో సహా తేలికపాటి లక్షణాలను కనిపించాయని వైల్డ్‌ లైఫ్‌ గ్రూప్‌ తెలిపింది. అలాగే నైట్ సఫారీకి చెందిన ముగ్గురు కీపర్లకు కోవిడ్ పాజిటివ్‌ వచ్చినట్లు పేర్కొంది.

దీంతో ఆసియాటిక్ సింహాల పార్క్‌ నైట్‌ సఫారిని మూసేసినట్లు వైల్డ్‌ లైఫ్‌ గ్రూప్‌ అధికారులు చెప్పారు. ఈమేరకు వైల్డ్‌లైఫ్ గ్రూప్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్ సోంజా లూజ్ మాట్లాడుతూ..."సాధారణంగా, వైరస్ కారణంగా తీవ్రమైన అనారోగ్యానికి గురికావు. కొద్దిపాటి సహాయక చికిత్సతో సింహాలు పూర్తిగా కోలుకుంటాయని మేము భావిస్తున్నాము. అయితే, తదుపరి చికిత్స అవసరమైతే గనుక యాంటీ ఇన్‌ఫ్లమేటరీలు, యాంటీబయాటిక్స్  ఇస్తాం" అని చెప్పారు.

(చదవండి: పెళ్లి చేసుకున్న మలాల.. ఫోటోలు వైరల్‌)

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌