amp pages | Sakshi

క్యాపిటల్‌ హిల్‌ ఘటన: ‘అక్కడ మన జెండా ఎందుకుంది?’

Published on Thu, 01/07/2021 - 18:34

వాషింగ్ట‌న్‌: అమెరికాలోని క్యాపిట‌ల్ హిల్ బిల్డింగ్‌పై అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌ద్ద‌తుదారులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో న‌లుగురు చ‌నిపోయారు. ఇక దీని పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అయ్యింది. పలువురు దేశాధినేతలు ఈ ఘటనను ఖండించారు. ఇక నిరసనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఎందుకంటే ఆ వీడియోలో ఓ వ్య‌క్తి భార‌త త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ప‌ట్టుకొని కనిపించ‌డం గ‌మ‌నార్హం. అయితే ఆ వ్య‌క్తి ఎవ‌రు? అత‌డు ఏ పార్టీకి చెందిన‌వాడ‌న్న దానిపై ఇంకా ఎలాంటి స్ప‌ష్ట‌త లేదు. కానీ అమెరికా ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు వ్య‌తిరేకంగా ఇంత పెద్ద ఎత్తున జ‌రుగుతున్న నిర‌స‌న కార్య‌క్ర‌మంలో త్రివర్ణపతాకం క‌నిపించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.(చదవండి: బైడెన్‌ గెలుపును ధ్రువీకరించిన కాంగ్రెస్)

‘ఇలాంటి ఉద్రిక్త వాతావరణంలో మన జెండా ఎందుకుంది... ఇలాంటి చోట మన మద్దతు అనవసరం అంటున్నారు’ నెటిజనులు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ కూడా దీని మీద స్పందించారు. ఈ వీడియోను ట్విట‌ర్‌లో షేర్ చేస్తూ.. అక్క‌డ మ‌న జెండా ఎందుకు ఉందంటూ ప్ర‌శ్నించారు. ఈ పోరాటంలో మ‌నం పాలుపంచుకోవాల్సిన అవ‌స‌రం అస‌లే లేదంటూ ఆయ‌న ట్వీట్ చేశారు. అయితే ఈ వీడియో ఈ రోజు జరగిన నిరసనకు సంబంధించిందా.. లేక పాత వీడియోని ఇప్పుడు మళ్లీ పోస్ట్‌ చేశారా అనేది ప్రస్తుతానికి తెలియలేదు. ఇక అమెరికా కాంగ్రెస్‌ బైడెన్‌ని అధ్యక్షుడిగా ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)