amp pages | Sakshi

భారతీయ ఐటీ నిపుణులకు భారీ ఊరట

Published on Thu, 02/25/2021 - 12:10

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌  భారత ఐటీ నిపుణులకు తీపి కబురు అందించారు.  ఇప్పటిదాకా అమెరికాలోకి ప్రవేశించకుండా అనేకమంది  గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులను  అడ్డుకున్న గత ప్రభుత్వం ఆర్డర్‌ను జో బైడెన్ బుధవారం ఉపసంహరించుకున్నారు. దీంతో గ్రీన్ కార్డ్ కోరుకునేవారికి భారీ ఉపశమనం కలిగించారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వివాదాస్పద ఆర్డర్లపై బైడెన్‌ తీసుకున్నంటున్న సంచలన నిర‍్ణయాల్లో భాగంగా  తాజాగా మరో  కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. గత ప్రభుత్వం విధించిన వీసా నిషేధం మార్చి 31తో ముగుస్తున్న నేపథ్యంలో తాజా నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది.  (అదిగదిగో గ్రీన్‌ కార్డు)

కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలను సరళీకృతం చేస్తానంటూ డెమొక్రాటిక్ అధ్యక్షుడు బైడెన్ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. గ‌త ఏడాది క‌రోనా కార‌ణంగా ఉద్యోగాలు కోల్పోయిన అమెరికా వ‌ర్క‌ర్ల హ‌క్కుల‌ను కాపాడే చర్యల్లో భాగంగా ట్రంప్ ప్రభుత్వం గ్రీన్‌ కార్డుల జారీ వీసాలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ట్రంప్‌ అప్పటి ఆంక్షలు సరైనవి కాదంటూ తాజా ప్ర‌క‌ట‌న‌లో బైడెన్ స్ప‌ష్టం చేశారు. ఈ ఆంక్ష‌లు అమెరికాలోని కుటుంబాలను తిరిగి కలవకుండా నిరోధించాయని, అమెరికా వ్యాపారాల‌ను తీవ్రంగా దెబ్బ‌తీశాయ‌ని బైడెన్  పేర్కొన్నారు. కాగా గత ఏడాది అక్టోబరులో  ఇమ్మిగ్రెంట్స్‌పై ట్రంప్ నిషేధాన్ని ఇమ్మిగ్రేషన్ అటార్నీ కర్టిస్ మోరిసన్ తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.  కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ సంక్షోభంలో వీసా ప్రాసెసింగ్‌ను మూసివేత నెలల తరబడి సాగుతున్న దరఖాస్తుల బ్యాక్‌లాగ్‌ను పరిష్కరించాల్సి ఉంటుందని మారిసన్‌ వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియకు సంవత్సరాలు పట్టవచ్చని కూడా ఆయన అన్నారు. “ఇది ట్రంప్ సృష్టించిన బ్యాక్‌లాగ్”,  ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను  నాశనం చేశాడంటూ మోరిసన్ మండిపడ్డారు.

Videos

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్

"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)