amp pages | Sakshi

పోర్న్ సైట్లలో వీడియోలు..జడ్జీ తీర్పుతో బాధితుల షాక్

Published on Sun, 10/03/2021 - 16:20

మాడ్రిడ్: స్పెయిన్‌లోని ఓ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది. మహిళా హక్కుల సంఘాలు ఆ తీర్పును వ్యతిరేకిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. 2019లో సెర్వో పట్టణంలో జరిగిన మారుక్సైన పండగలో పాల్గొన్న సుమారు 80 మంది మహిళలు ఆరుబయట మూత్రవిసర్జన చేశారు. ఈ ఘటనను గుర్తుతెలియని వ్యక్తులు రహస్య కెమెరాల ద్వారా రికార్డు చేసి.. పోర్న్‌ సైట్లలో అప్‌లోడ్‌ చేశారు. ఈ ఘటన స్పెయిన్‌లో తీవ్ర దుమారం రేపింది.

తమకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌లు అశ్లీలసైట్లలో ఉన్నాయని తెలుకున్న బాధితులు 2020లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా బాధిత మహిళలు న్యాయస్థానాన్ని ఆ‍శ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయమూర్తి పాబ్లో మునోజ్ వాజ్‌క్వెజ్.. ఆ వీడియోలు బహిరంగ ప్రదేశంలో రికార్డ్ చేసినవని, దీన్ని నేరంగా పరిగణించలేమని కేసును కొట్టివేశారు. మహిళల శారీరక, నైతిక విలువలను ఉల్లంఘించే ఉద్దేశం లేదని కోర్టు పేర్కొంది.

ఉమెన్ ఇన్ ఈక్వాలిటీ జాతీయ అధ్యక్షురాలు సుసానా కమరెరో తీర్పును పున:సమీక్షించాలని ల్యూగో ప్రావిన్షియల్ కోర్టును కోరింది. తీర్పుపై ఓ బాధితురాలు స్పందిస్తూ.. స్నేహితురాలు ద్వారా తన వీడియోలు అశ్లీలసైట్లలో ఉన్నాయని తెలుసుకొని తీవ్రమైన ఆందోళనకు గురయ్యానని అన్నారు. ఆ వీడియోలు చూసిన వెంటనే ఏడుపు ఆపుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తీర్పు కూడా తనకు తీవ్రమైన నిరాశను కలిగించిందని తెలిపారు. దీనిపై మహిళా మంత్రి ఐరీన్ మోంటెరో స్పందిస్తూ.. మహిళల అనుమతి లేకుండా ఆమె ఫోటోలు తీయడం, అశ్లీలసైట్లలోగాని, ఇతరులకుగాని పంపటం లైంగిక హింస అవుతుందని అ‍న్నారు.

ల్యూగో ప్రావిన్షియల్ కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ.. సోషల్‌ మీడియాలో మహిళలు,యువతులు #Justice Maruxaina పేరుతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహిళల హక్కుల సంఘం కార్యకర్త అనా గార్సియా.. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ మహిళల స్వేచ్ఛకు భంగం కలిగేలా ఇలా వీడియోలు తీయటం శిక్షార్హం అని తెలిపారు. భవిష్యత్తులో ఈ తీర్పు వల్ల మహిళ స్వేచ్ఛ మరింత ప్రమాదంలో పడుతుందని అన్నారు. మహిళలను రహస్యంగా వీడియోలు తీసి అశ్లీలసైట్లలో అప్‌లోడ్‌ చేయటం అధికమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)