amp pages | Sakshi

ఈ జేజమ్మ మళ్లీ పుడుతుందట!

Published on Sun, 07/31/2022 - 03:14

ఇదేంటి ఈ ఏనుగులకు జూలు ఉంది.. భలే విచిత్రంగా ఉన్నాయే అనుకుంటున్నారా? కానీ ఇవి ఏనుగులు కాదు.. వాటి జేజమ్మలు.. అంటే ఏనుగుల పూర్వీ­కులన్నమాట. వీటిని వూలీ మామత్‌లు అంటారు. చూసేందుకు ఆఫ్రికా ఏనుగుల తరహాలో బలిష్టంగా కనిపిస్తూ ఒంటినిండా జూలుతో మంచు యుగంలో భూమిపై సంచరించిన జీవులివి. యూరప్, ఉత్తర అమెరికాతో­పాటు ఆసియాలోని మంచు ప్రాంతాల్లో 3 లక్షల ఏళ్ల కిందట తిరిగిన ఈ జీవులు దాదాపు 10 వేల ఏళ్ల కిందటే అంతరించిపోయాయి.

ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటే.. ప్రఖ్యాత హాలీవుడ్‌ చిత్రం జురాసిక్‌ పార్క్‌లో జన్యు శాస్త్రవే­త్తలు ఎలాగైతే అంతరించిన డైనోసార్లను ప్రతిసృష్టి చేస్తారో అదే తరహాలో వూలీ మామత్‌లను తిరిగి భూమ్మీదకు తీసుకొ­చ్చేం­దుకు అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ కొలోస్సల్‌ బయోసైన్సెస్‌ గట్టి ప్రయ­త్నమే చేస్తోంది. ఇందుకోసం ఇప్ప­టికే ఏకంగా 15 లక్షల డాలర్లను కూడా సమీకరించింది.

ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఆ కంపెనీ బయటకు వెల్లడించనప్పటికీ డీఎన్‌ఏ ఎడిటింగ్‌ పద్ధతి ద్వారా వూలీ మామత్‌లను సృష్టించాలను­కుంటోంది. దీన్నే మరోలా చెప్పాలంటే వూలీ మామత్‌లకు అత్యంత దగ్గరి పోలిక­లు­గల, 99% డీఎన్‌ఏను పోలిన ఇప్పటి ఏను­గుల డీఎన్‌ఏను క్రమంగా వూలీ మామ­త్‌ల తరహాలోకి మార్చుకుంటూ వెళ్లాలని భావిస్తోంది. వచ్చే 10–15 ఏళ్ల­పాటు ఈ ప్రక్రియపైనే పనిచేయను­న్నట్లు సంస్థ చెబుతోంది. ఈ ప్రక్రియ విజ­యవంతమైతే అప్పుడు వూలీ మామత్‌ లేదా మామత్‌ను పోలిన అండాలను ల్యాబ్‌లలో తయారు చేసి వాటిని ఆసి­యా ఏనుగుల గర్భంలో ప్రవేశపె­ట్టాల­నేది కొలోస్సల్‌ బయోసైన్సెస్‌ లక్ష్యం.

ఎందుకీ ప్రయోగం?
ఆర్కిటిక్‌ ప్రాంతంలో మట్టి, ఇసుక, మంచు­తో ఘనీభవించిన నేల (పర్మాఫ్రాస్ట్‌) పొరల నుంచి భూతాపం వల్ల క్రమంగా మంచు కరి­గిపోతోంది. భూమిపై అత్యధికంగా కార్బన్, మీథేన్‌లను పట్టి ఉంచిన పర్మా­ఫ్రాస్ట్‌ బల­హీనపడితే అది భూ వాతావరణంలోకి భారీ స్థాయిలో కార్బన్‌ డై ఆౖð్సడ్, మీథేన్‌ వాయు­వులను విడుదల చేస్తుంది. ఈ పరిణామం మానవాళి ఉనికికే ప్రమాదం కానుంది.

ఈ నేప­థ్యంలో కొలోస్సల్‌ బయో­సైన్సెస్‌తో­పాటు మరికొన్ని బయోటెక్నాలజీ సంస్థలు వూలీ మామత్‌లు సహా అంతరించిపో­యిన ఆర్కిటిక్‌ ప్రాంతాల జంతువు­లను భారీ స్థాయి­లో ప్రతిసృష్టి చేసి వాటిని సహజ ఆవాస ప్రాంతానికి తరలించాలని భావిస్తు­న్నాయి. ఈ జీవులు ఆర్కిటిక్‌లో సంచరిస్తే వాటి బరువు వల్ల మంచు­పొరలు లోపలకు తిరిగి గట్టిపడటంతోపాటు ఆ పొరల మధ్య చిక్కుకుపోయిన ఉష్ణం వెళ్లిపో­తుందని శాస్త్ర­వే­త్తల అంచనా. ఫలితంగా పర్మాఫ్రాస్ట్‌లో చల్లదనం శాశ్వతంగా ఉండిపోతుందని.. ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

Videos

మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?