amp pages | Sakshi

40 ఏళ్లుగా ప్రపంచానికి దూరంగా.. సన్యాసిలా బతుకుతున్నాడు

Published on Tue, 11/09/2021 - 14:33

సాక్షి, వెబ్‌డెస్క్‌: కరోనా కట్టడి కోసం మూడు నెలల పాటు లాక్‌డౌన్‌ విధిస్తేనే జనాలకు పిచ్చిపట్టింది. మనుషుల్లో తిరగక.. బయటకు వెళ్లక ఇంటికే పరిమితం కావడం అంటే పెద్ద పనిష్మెంట్‌గా భావించారు. చుట్టూ నలుగురు మనుషులు, కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉన్నా.. భారంగా గడిపారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వ్యక్తి మాత్రం మనకు చాలా భిన్నం. ఆయన గత 40 ఏళ్లుగా మనుషులకు చాలా దూరంగా.. ప్రకృతి ఒడిలో నివసిస్తున్నారు. గ్యాస్‌, కరెంట్‌, ఇంటర్నెట్‌ వంటి సదుపాయాలు లేకపోయినా సంతోషంగా జీవిస్తున్నారు. భౌతిక సుఖాలు పరిత్యజించి ఇలా సన్యాసిగా జీవించడం చాలా బాగుంది అంటున్న ఈ వ్యక్తి వివరాలు.. 


(photo cridit BBC)

40 ఏళ్లుగా అడవిలో నివసిస్తున్న ఈ వ్యక్తి పేరు కెన్‌ స్మిత్‌(74). ప్రస్తుతం అతడు స్కాట్లాండ్‌ రాన్నోచ్‌ మూర్‌ అంచున ఉన్న సమీప రహదారి నుంచి రెండు గంటలు లోపలకి ప్రయాణిస్తే కనిపించే లోచ్‌ ట్రీగ్‌లో ఓ చెక్క గదిలో నివాసం ఉంటున్నాడు. ఈ ప్రాంతాన్ని లోన్లీ లోచ్‌ అని పిలుస్తారు. మనుషులకు దూరంగా ఉంటున్న కెన్‌ గురించి తొలుత 9 సంవత్సరాల క్రితం ఫిల్మ్‌ మేకర్‌ లిజ్జీ మెక్‌కెంజీకి తెలిసింది. ఆమె గత రెండెళ్ల క్రితం ఇతని గురించి బీబీసీ స్కాంట్లాండ్‌లో ‘ట్రైగ్‌ సన్యాసి’ పేరుతో డాక్యూమెంటరీ ప్రచురించింది. 

ఆ ప్రమాదంతో జీవితంలో మార్పు..
డెర్బీషైర్‌కు చెందిన కెన్‌ 15వ ఏట నుంచే పని చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో 26వ ఏట ఉండగా దారి దోపిడి దొంగలు కెన్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ సమయంలో 23 రోజుల పాటు స్పృహ లేకుండా ఉన్నాడు. అతడి స్థితి చూసిన వారు.. కెన్‌ కోలుకోవచ్చు.. కానీ మాట్లాడలేడు.. నడవలేడు అన్నారు. అయితే వారి మాటలు అబద్ధం చేస్తూ కెన్‌ చాలా త్వరగా పూర్వపు జీవితాన్ని ప్రారంభించాడు. 


(photo cridit BBC)

22 వేల మైళ్లు ప్రయాణం...
ప్రమాదం కెన్‌ జీవితాన్ని మార్చింది. ఎవరి మాటలు వినకూడదని నిర్ణయంచుకున్నాడు. ఆ సమయంలో అతడికి అడవిపై ఆసక్తి కలిగింది. ఇక నడక ప్రారంభించాడు. దాదాపు 22 వైల మైళ్లు నడిచి అలాస్కా సరిహద్దలో ఉన్న కెనడియన్‌ భూభాగమైన యుకాన్‌ చేరుకున్నాడు. కెన్‌ ఈ ప్రయాణంలో ఉండగానే అతడి తల్లిదండ్రులు మరణించారు. ఇంటికి వచ్చాక విషయం తెలుసుకున్న కెన్‌ గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఈ విషాదం నుంచి కోలుకోవడానికి అతడి చాలా సమయం పట్టింది.

తల్లిదండ్రుల మరణం తర్వాత పూర్తి ఒంటరిగా..
తల్లిదండ్రులు చనిపోయారు.. నా అన్న వాళ్లు ఎవరు లేరు. దాంతో ఇక జనవాసాలకు దూరంగా.. అడవిలోనే జీవించాలనుకున్నాడు కెన్‌. ఏకాంత ప్రదేశం కోసం వేల కొద్ది మైళ్లు ప్రయాణం చేసి చివరకు లోచ్‌ ప్రాంతాన్ని చేరుకున్నాడు. అదే తనకు అనువైన స్థావరంగా భావించాడు. అక్కడే దుంగలతో ఓ చిన్నపాటి గదిని నిర్మించుకున్నాడు.


(photo cridit BBC)

నో గ్యాస్‌, నో కరెంట్‌...
గత 40 ఏళ్లుగా ఒక్కడే.. ఆ చిన్న గదిలో నివసిస్తున్నాడు కెన్‌. గ్యాస్‌, కరెంట్‌ వంటి సదుపాయాలు లేవు. చేపలు పట్టడం, కూరగాయలు, బెర్రీస్‌ పండిచి వాటిని ఆహారంగా తీసుకునేవాడు. అతడి దగ్గర ఓ జీపీఎస్‌ పర్సనల్‌ లోకేటర్‌ బీకాన్‌ ఉంది. ఇక ఒంటిరిగా బతకాలంటే.. కచ్చితంగా చేపలు పట్టడం రావాలంటాడు కెన్‌. 

కాపాడిన జీపీఎస్‌ పర్సనల్‌ లోకేటర్‌..
అయితే 2019లో తొలిసారి కెన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఫిల్మ్‌మేకర్‌ లిజ్జీ కెన్‌ వద్ద నుంచి వెళ్లిన పది రోజుల తర్వాత, ఫిబ్రవరి 2019లో, కెన్ బయట మంచులో ఉన్నప్పుడు స్ట్రోక్‌కు గురయ్యాడు. అయితే అతడి ఉన్న జీపీఎస్‌ లోకేటర్‌ టెక్సాస్‌, హస్టన్‌లో ఉన్న రెస్పాన్స్‌ కేంద్రానికి ఎస్‌ఓఎస్‌ పంపడంతో కెన్‌ పరిస్థితి గురించి వారికి తెలిసింది.


(photo cridit BBC)

వారు ఈ విషయాన్ని వెంటనే యూకేలోని కోస్ట్‌గార్డ్‌కు తెలియజేశారు. వారు వెంటనే కెన్‌ను ఫోర్ట్ విలియమ్‌లోని ఆసుపత్రికి విమానంలో తరలించారు. అక్కడ అతను కోలుకోవడానికి ఏడు వారాలు పట్టింది. వైద్యులు అతనికి జనవాసంలో ఉండాలని కోరారు. కానీ కెన్ తన క్యాబిన్‌కు తిరిగి వచ్చాడు. నాకు ఏం కాదు 102 ఏళ్లు బతుకుతాను అంటున్నాడు కెన్‌.

చదవండి: 
అవును నా ఇంట్లో దెయ్యాలున్నాయి.. తరిమేశాను: నటి
పొరపాటున వేరే వారి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి..!
చేతి సైగతో మృగాడి చెర నుంచి తప్పించుకుంది...

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌