amp pages | Sakshi

తనను తాను గుర్తుపట్టలేక.. భర్తపై దాడి

Published on Wed, 01/27/2021 - 19:27

మెక్సికో సిటీ: అల్జిమర్స్‌ వ్యాధి వస్తే.. తప్ప ఓ వ్యక్తి తనను తాను మర్చిపోవడం అసంభవం. చిన్పప్పటి నుంచి ముసలి వారు అయ్యేవరకు వేర్వేరు వయస్సులో మనం ఎలా ఉన్నామో మనకు తెలుస్తుంది. ఎప్పుడైనా పాత ఫోటోలు కనిపిస్తే.. వాటిల్లో మనల్ని చూసుకుని.. మురిసిపోతూ.. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటాం. కానీ మెక్సికోలో మాత్రం ఓ పాత ఫోటో భర్త ప్రాణాల మీదకు తెచ్చింది. భర్త పక్కన ఉన్నది తానే అని గుర్తు పట్టలేని మహిళ.. అతడిపై కత్తితో దాడి చేసింది. వివరాలు.. లియోనోరా ఎన్, జువాన్‌లకు వివాహం అయ్యి చాలా సంవత్సరాలు అవుతోంది. పైగా ప్రేమ వివాహం. ఇదిలా ఉండగా.. ఓ సారి జువాన్‌ తాము ప్రేమించుకున్న సమయంలో తీసుకున్న ఫోటోలు పూర్తిగా పాడయిపోవడం గమనించాడు. దాంతో వాటిని డిజిటలైజ్‌ చేయించాడు. యవ్వనంలో ఉండగా తీసిన ఫోటోలు.. పైగా డిజిటలైజేషన్‌ చేయించడంతో అవి మరింత అందంగా ఉన్నాయి.
(చదవండి: మనుషుల్ని తిన్నారు.. పందుల్ని వదిలేశారు)

ఇక ఈ ఫోటోల్లో అతడి భార్య ఎంతో స్లిమ్‌గా.. అందంగా ఉంది. అలా ఇద్దరు కలిసి ఉన్న ఓ ఫోటోని జువాన్‌ తన మొబైల్‌ వాల్‌ పేపర్‌గా పెట్టుకున్నాడు. పాపం అప్పుడతడికి తెలియదు.. ఆ ఫోటో తన ప్రాణాల మీదకు తెస్తుందని. ఓ రోజు భార్య ఈ ఫోటోని చూసింది. జువాన్‌ పక్కన ఉన్నది తానే అని గుర్తుపట్టలేకపోయింది. దాంతో భర్త పెళ్లికి ముంద మరో స్త్రీతో రిలేషన్‌లో ఉన్నాడని అనుమానించింది. ఆ కోపంలో కత్తి తీసుకుని భర్త మీద దాడి చేసింది. ఆమె ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కాని జువాన్‌ ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని బయటకు పరుగు తీశాడు. ఎలాగో అలా పోలీసులకు కాల్‌ చేయడంతో వారు వచ్చి జువాన్‌ భార్యని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె తన కోపానికి కారణం చెప్పడంతో షాక్‌ అయిన జువాన్‌.. ఆ ఫోటో తమదేనని.. డేటింగ్‌ చేసే రోజుల నాటి ఫోటోని తాను డిజిటలైజ్‌ చేయించానని చెప్పాడు. పాపం తనను గుర్తుపట్టలేకపోయినా లియానారో కాస్త ఆలస్యం అయ్యుంటే భర్తను చంపేసేది. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెకి కౌన్సెలింగ్‌ ఇచ్చి వదిలేశారు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌