amp pages | Sakshi

‘పండో’.. వంద ఎకరాల చెట్టు..

Published on Mon, 06/05/2023 - 05:17

కొమ్మలకు ఊడలు వేస్తూ విస్తరించే భారీ మర్రి చెట్లు మనకు తెలుసు. నాలుగు ఎకరాల్లో విస్తరించిన పిల్లల మర్రిచెట్టు తెలుసు. కానీ వందకుపైగా ఎకరాల్లో,  47 వేలకుపైగా కాండాలతో విస్తరించి, వేల ఏళ్లుగా బతికేస్తున్న ఓ అతి పెద్ద చెట్టు ఉంది తెలుసా?  సోమవారం ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా.. ఆ చెట్టు విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

అది ఒక చెట్టు అడవి.. 
అమెరికా దక్షిణ ఉటా ప్రాంతంలో ఒకేచోట 47 వేలకుపైగా ఆస్పెన్‌ చెట్లు (పొడవుగా పెరిగే అశోకా చెట్ల వంటివి) పక్కపక్కనే ఉన్నాయి. వాటిపై ఇటీవల పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు అవన్నీ ఒకే చెట్టు శాఖలని.. అన్నింటి వేర్లు పూర్తిగా అనుసంధానమై ఉన్నాయని గుర్తించారు. ఒక ప్రధాన చెట్టు వేర్లు భూమిలో విస్తరిస్తున్నకొద్దీ.. వాటి నుంచి కాండం ఉద్భవిస్తూ మరోచెట్టులా ఏర్పడినట్టు తేల్చారు. ఈ చెట్టును ‘పండో’ అని పిలుస్తున్నారు. లాటిన్‌ పదమైన దీనికి అర్థం ‘నేను విస్తరిస్తా’ అని అర్థం. 

అతి పెద్ద జీవి ఇదే.. 
♦ మొత్తం 100 ఎకరాలకుపైగా విస్తరించి ఉన్న ఈ చెట్టు వయసు 9 వేల ఏళ్లకుపైగా ఉండవచ్చని, బరువు 6 వేల టన్నులు ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమ్మీద బరువు, పరిమాణం పరంగా అతి పెద్ద జీవి ఇదేనని అంటున్నారు. 

♦ ‘పండో’ చెట్టు వేలాది కాండాలకు ఉన్న ఆకులు కదిలిన శబ్దం.. వాటి వేళ్ల నెట్‌వర్క్‌ ద్వారా వ్యాపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా జెఫ్‌ రైస్‌ అనే సౌండ్‌ ఆర్టిస్ట్‌.. ఈ వేర్లపై దూరం దూరంగా పలుచోట్ల మైక్రోఫోన్లు, హైడ్రోఫోన్లు (నీటిలో, భూమిలోపల ధ్వనులను రికార్డు చేసేవి) అమర్చి శబ్దాలను రికార్డు చేశారు. ఎక్కడో ఒక ఆస్పెన్‌ కాండంపై మెల్లగా తడితే.. వందల అడుగుల దూరంలోని వేర్ల వద్ద ఆ ధ్వని వినిపిస్తున్నట్టు గుర్తించారు. 

♦ ‘పండో’ చెట్టు, దాని చిత్రమైన వేర్ల వ్యవస్థపై శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. వేల ఏళ్ల కిందటి పరిస్థితులు, వాతావరణ మార్పుల ప్రభావం, మొక్కలు/చెట్ల మధ్య అనుసంధానం వంటి అంశాలను దీని నుంచి గుర్తించవచ్చని భావిస్తున్నారు.

వేల ఏళ్ల నుంచి ‘సింగిల్‌’గా.. 
చిలీ దక్షిణ ప్రాంతంలోని అడవిలో ఉన్న అతి పురాతనమైన సైప్రస్‌ చెట్టు ఇది. ‘పండో’లా వేర్వేరు చెట్ల తరహాలో కాకుండా.. ఒకే కాండంతో, ఒకేసారి పుట్టి పెరిగిన చెట్లలో ఇదే అత్యంత ఎక్కువ వయసున్నది అని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. దీనికి ‘గ్రేట్‌ గ్రాండ్‌ ఫాదర్‌’ అని పేరు పెట్టారు. 

సుమారు 5,400 ఏళ్ల వయసు ఉంటుందని భావిస్తున్న ఈ సైప్రస్‌ చెట్టు ఎత్తు 91 అడుగులు, కాండం వెడల్పు 13 అడుగులు కావడం విశేషం. 

♦ ఇన్ని వేల ఏళ్లుగా మారుతూ వచ్చిన వాతావరణాన్ని, కార్చిచ్చులను, ఫంగస్‌లను తట్టుకుని బతికిన ఈ చెట్టు కొన్నేళ్లుగా దెబ్బతింటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్ని రక్షించుకునేందుకు చర్యలు చేపట్టారు. 

దీనికన్నా ముందు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ‘మెతుసలే’ అనే పైన్‌ చెట్టు 4,853 ఏళ్ల వయసుతో.. భూమ్మీద అత్యంత ఎక్కువ వయసున్న చెట్టుగా రికార్డుల్లో నమోదైంది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)