amp pages | Sakshi

కిమ్ దేశంలో దారుణ శిక్షలు.. రెండేళ్ల చిన్నారినీ వదల్లేదు!

Published on Sat, 05/27/2023 - 15:38

ఉత్తరకొరియా అధ్యక్షుడి నిరంకుశ పాలన గురించి తరచూ వార్తల్లో వింటూనే ఉంటాం. వివాదాస్పద నిర్ణయాలతో గ్లోబల్ మీడియాలో నిలుస్తుంటారు. భయంకరమైన చట్టాలతో దారుణ శిక్షలకు గురిచేస్తుంటారు. ఇలాంటి ఓ విషయాన్నే అమెరికా నివేదిక వెల్లడించింది. ఆ దేశంలో బైబిల్ కలిగి ఉన్నవారికి మరణశిక్షను విధిస్తున్నారంట. ఆ కుటుంబ సభ్యులను కఠిన శిక్షలకు గురిచేస్తున్నారు. అలా ఓ రెండేళ్ల చిన్నారికి కూడా జీవితఖైదు విధించినట్లు నివేదిక పేర్కొంది.

జైళ్లలో మగ్గుతున్న 70 వేల మంది
అమెరికా విదేశాంగ శాఖ 'అంతర్జాతీయ మత స్వేచ్ఛ 2022' పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. ఉత్తరకొరియాలో ఇతర మత విశ్వాసాలను అవలంభించిన వారిపై దారుణంగా ప్రవర‍్తిస్తున్నారని నివేదిక పేర్కొంది. దాదాపు 70 వేల మంది క్రిస్టియన్స్‌ జైళ్లలో మగ్గుతున్నారని వెల్లడించింది. మత గ్రంథాన్ని కలిగి ఉండటం, మతపరమైన కార్యకలాపాలకు పాల్పడ్డారనే అభియోగాలతో 2009లో ఓ చిన్నారి కుటుంబాన్ని అరెస్టు చేశారు. వారందరికీ జీవిత ఖైదు విధించారని నివేదిక వెల్లడించింది. 

దారుణ వేధింపులు
ఆ దేశంలో మతపరమైన శిక్షలు అనువభవిస్తున్న వారందరు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. శారీరక హింస, జీవించే హక్కుకు భంగం వాటిల్లడం, పారదర్శక విచారణ జరపకపోవడం, లైంగిక వేధింపులతో వారిని వేధిస్తున్నారని నివేదిక వెల్లడిచ్చింది.

కొరియా ఫ్యూచర్ అనే లాభాపేక్ష లేని సంస్థ డిసెంబర్ 2021లోనే ఓ నివేదికను విడుదల చేసింది. మతపరమైన స్వేచ్ఛ ఆ దేశంలో అడుగంటిపోయిందని తెలిపింది. మత స్వేచ్ఛను కోరుకుంటే వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపింది. అవయవాల దోపిడి, హత్యలు అత్యాచారం వంటి దారుణాలకు ఒడిగడుతున్నారని పేర్కొంది.
చదవండి: ‘స్నేక్‌ వైన్‌’ అంటే ఏమిటి? దీనిని ఎలా తయారు చేస్తారో తెలిస్తే...

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)