amp pages | Sakshi

Imran Khan: ఇమ్రాన్‌ ఖాన్‌ సెక్స్‌ కాల్‌ దుమారం

Published on Wed, 12/21/2022 - 15:31

పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్‌సాఫ్‌ అధినేత, పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చిక్కుల్లో పడ్డారు. ఓ మహిళతో అత్యంత సన్నిహితంగా మాట్లాడినట్లుగా ఆడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందర ఈ పరిణామం చోటు చేసుకోవడంతో.. పాక్‌లో రాజకీయ దుమారం చెలరేగింది. 

పాకిస్థానీ జర్నలిస్ట్‌ సయ్యద్‌ అలీ హైదర్‌ యూట్యూబ్‌లో ఆ ఆడియో క్లిపులను షేర్‌ చేశారు. దీంతో పాక్‌లో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. అందులో ఉంది ఇమ్రాన్‌ ఖాన్‌ వాయిస్‌ అనేది ఆరోపణ.  విశేషం ఏంటంటే.. ఈ ఆడియో క్లిప్స్‌ తాజావేనని అందులోని సంభాషణల ఆధారంగా తెలుస్తోంది. అయితే.. ఇది ప్రధాని కార్యాలయం నుంచే వెలువడ్డాయని ఖాన్‌ అనుకూల మీడియా ఛానెల్స్‌ కథనాలు వెలువరిస్తున్నాయి. 

మరోవైపు.. పీటీఐ మాత్రం ఈ కాల్‌ సంభాషణలను కొట్టిపారేస్తోంది. అదంతా ప్రభుత్వం కుట్రేనని, తమ అధినేతను బద్నాం చేసే కుట్రలో భాగంగా ఫేక్‌ క్లిప్స్‌తో ప్రచారం చేస్తోందని ఆరోపిస్తోంది. వాళ్లు ఇంతకంటే ఏం చేయలేరని పీటీఐ అధికార ప్రతినిధి అర్సలన్‌ ఖలీద్‌ పేర్కొన్నారు. 

ఇక ఆ ఆడియో క్లిప్‌లో సదరు మగ గొంతు తనను కలవాలంటూ అవతలి మహిళను బలవంతం పెట్టగా.. ఆమె కుదరదని చెప్పడం వినొచ్చు. అంతేకాదు.. తన భార్యాబిడ్డలు రాకుండా ప్రయత్నిస్తానని కూడా ఆమెతో చెప్పాడు ఆ వ్యక్తి. ఇదిలా ఉంటే.. ఇమ్రాన్‌ ఖాన్‌ కాస్త ఇమ్రాన్‌ హష్మీ(బాలీవుడ్‌ నటుడు)గా మారిపోయాడంటూ సౌత్‌ ఏషియా కరస్పాండెంట్‌, జర్నలిస్ట్‌ నలియా ఇనాయత్‌ ఎద్దేవా చేశారు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌