amp pages | Sakshi

వైట్‌హౌజ్‌ పరిసరాల్లో కాల్పుల కలకలం

Published on Tue, 08/11/2020 - 08:26

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్‌ పరిసరాల్లో కాల్పులు కలకలం సృష్టించాయి. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  సోమవారం విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో గుర్తు తెలియని దుండగుడు కార్యాలయం బయట కాల్పులకు తెగబడ్డాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన సీక్రెట్‌ సర్వీస్‌ గార్డ్స్‌ సదరు వ్యక్తి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో ఎదురు కాల్పులు జరపడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దుండగుడిని వెంటనే ఆస్పత్రికి తరలించామని, ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు శ్వేతసౌధ భద్రతా వర్గాలు వెల్లడించాయి.(కాల్పుల కలకలం.. ఒకరి మృతి)

కాగా వైట్‌హౌజ్‌ బయట కాల్పుల శబ్ధం వినిపించగానే ట్రంప్‌ ప్రెస్ ఈవెంట్‌ మధ్యలోనే ఆపివేసి తన కార్యాలయం లోపలికి వెళ్లిపోయారు. దాదాపు 10 నిమిషాల పాటు అక్కడే ఉండిపోయారు. పరిస్థితి చక్కబడగానే మళ్లీ విలేకరుల ఎదుటకు వచ్చిన ట్రంప్‌.. వైట్‌హౌజ్‌ పరిసరాల్లో సంచరిస్తూ భద్రతకు భంగం కలిగించిన ఓ వ్యక్తిపై సీక్రెట్‌ సర్వీసెస్‌ గార్డ్స్‌ కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. చట్టప్రకారమే సాయుధుడైన దుండగుడిపై చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. ‘‘వాళ్లు అత్యద్భుతమైన వ్యక్తులు. వాళ్ల సేవల పట్ల సంతోషంగా ఉన్నాను. ఎంతో భద్రంగా ఉన్నట్లు భావిస్తున్నాను’’ అని సత్వరమే స్పందించిన సీక్రెట్‌ సర్వీస్‌ గార్డులపై ప్రశంసలు కురిపించారు. అదే విధంగా ఘటనపై విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ప్రపంచంలోని ప్రతీ మూల ఏదో ప్రమాదం పొంచి ఉంటూనే ఉంది కదా’’ అని సమాధానమిచ్చారు. (మా ట్రంప్‌ ప్రపంచానికే ప్రమాదకరం!)

ఇక ఈ విషయం గురించి వైట్‌హౌజ్‌ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న ఫిలిపోస్‌ మెలాకు అనే వ్యక్తి మాట్లాడుతూ.. సాయంత్రం 5.50 గంటలకు తనకు కాల్పుల శబ్దం వినిపించిందని, అయితే అంతకంటే ముందే ఓ అరుపు విన్నానని తెలిపారు. అది కచ్చితంగా మగ గొంతేనని, దాదాపు తొమ్మిది మంది సెక్యూరిటీ గార్డులు అతడి వైపుగా పరిగెత్తుకు వచ్చారని చెప్పుకొచ్చారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)