amp pages | Sakshi

ఆకాశంలో ‘గులాబీ’ మాయతో హడలెత్తిన జనం.. ఏలియన్స్‌ పనేనా?

Published on Fri, 07/22/2022 - 09:16

కాన్‌బెర్రా: ఆకాశం ఏ రంగులో ఉంటుందంటే నీలం అంటూ టక్కున చెప్పేస్తారు. కానీ.. ఆకాశంలో కొద్ది ప్రాంతం గులాబీ రంగులోకి మారితే ఆశ్చర్యమే కాదు.. ఏదో జరుగుతోందనే భయం కూడా కలుగుతుంది. సినిమాల్లో చూపించినట్లుగా ఆకాశం నుంచి ఎవరో భూమిపైకి వస్తున్నప్పు ఏర్పడిన మాదిరిగా ఉంటే.. అది మరింత భయాన్ని పెంచుతుంది. అలాంటి అనుభూతే ఆస్ట్రేలియాలోని మిల్దురా ప్రజలకు ఎదురైంది. గత బుధవారం సాయంత్రం వేళ ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఆకాశం లేత గులాబీ రంగులోకి మారిపోయింది. కొందరు దానిని అద్భుతం అంటూ వర్ణించగా.. కొందరు గ్రహాంతర వాసుల పనేనుంటూ భయాందోళనలకు గురయ్యారు. 

గులాబీ రంగులోకి మారిన ఆకాశం ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. గులాబీ రంగు కనిపించిన ప్రాంతం మధ్యలో భూమిని నుంచే కాంతి ప్రసారమవుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో భూమిపైన ఉన్న దాని నుంచే ఆ కాంతి వెలువడుతోందని, దాని ద్వారానే ఆకాశం గులాబీ రంగులోకి మారిపోయిందని పలువులు విశ్లేషించారు. మరోవైపు.. దీనిపై కొందరు నెటిజన్లు జోకులు పేల్చారు. అది ఏలియన్స్‌ సృష్టిగా కొందరు పేర్కొనగా.. మరికొందరు మాహా అద్భుతం అంటూ తెలిపారు. 

గులాబీ రంగుకు కారణమదే..
అయితే.. ఆకాశంలో ఏర్పడిన గులాబీ రంగుకు కారణం ఆ ప్రాంతంలో ఓ ఫార్మాసిటికల్‌ సంస్థ సాగు చేస్తున్న గంజాయి మొక్కలేనని తేల్చారు. ‘మా సంస్థలో కొత్త సాగు ప్రాంతం కోసం ప్రయోగాలు చేస్తున్న క్రమంలో ఆకాశంలోకి కాంతి ప్రసరణ జరగటం స్థానికులు గమనించారు. అది సోలార్ ఫ్లేర్ లేదా ఇంటర్ డైమెన్షనల్ పోర్టల్ కాదని మేము నమ్మకంగా చెప్పగలం.’ అని ట్విట్టర్‌ వేదికగా తెలిపింది ఫార్మా సంస్థ. గంజాయి మొక్కలు ఎదిగేందుకు వివిధ రకాల కాంతి అవసరమవుతుందని, పూలు పూసే సమయంలో ఎర్ర లైట్‌  ఉపయోగించాలని తెలిపారు ఫార్మా సంస్థ సీఈవో పీటర్‌ క్రాక్. కొత్త సాంకేతికతను ఈ ఏడాదే తీసుకొచ్చామని, ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆకాశంలో అద్భుత దృశ్యం ఏర్పడటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Sri Lanka: శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్తత.. నిరసనలపై కొత్త అధ్యక్షుడి ఉక్కుపాదం!

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌