amp pages | Sakshi

అదానీని ఆపండి...మళ్లీ శ్రీలంకలో మొదలైన నిరసన సెగ

Published on Thu, 06/16/2022 - 20:17

Stop Adani BY Citizens held a protest in Sri Lankas: శ్రీలంక విద్యుత్‌ బోర్డు చీఫ్ చేసిన సంచలన వ్యాఖ్యలతో రాజుకున్న గొడవ కాస్త ముదిరి పెనువివాదంగా మారింది. ఆయన.. మన్నార్‌ జిల్లాలోని ఎనర్జీ ప్రాజెక్టుని అదానీ గ్రూప్‌కి ఇచ్చేలా భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సపై ఒత్తిడి తెచ్చారని, ఆ విషయాన్ని స్వయంగా రాజపక్స చెప్పారంటూ.. అనుచితన వ్యాఖ్యలు చేశాడు. ఐతే ఆ తర్వాత ఆయన ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం, పదవికి రాజీనామ చేయడం అయిపోయనప్పటికీ ఆ వివాదం కార్చిచ్చులా రాజుకుంటోంది.

ఈ మేరకు శ్రీలంకలోని కొలంబోలో నిరసనకారులు అదాని గ్రూప్‌కి మన్నార్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌ని ఇ‍వ్వొద్దంటూ రోడ్లపై నిరసనలు చేపట్టారు. భారత ప్రధాని మోదీ, శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స చీకటి ఒప్పందంతో అదానీ గ్రూప్‌కి ఇచ్చేయాలనకుంటున్నారంటూ ఆరోపణలు చేశారు. అందుకనే ఎటువంటి పోటీ బిడ్డింగ్‌ ప్రక్రియ జరపకుండా అదానీ గ్రూప్‌కి ఈ ప్రాజెక్ట్‌ని కట్టబెట్టేందుకే ఈ అసంబంధమైన ఒప్పందం చేసుకున్నారంటూ నిరసనకారుల విరుచుకుపడ్డారు.

ఈ మేరకు శ్రీలంకలోని కొంతమంది నినరసకారులు స్టాప్‌ అదానీ అంటూ... సోషల్‌ మీడియా వేదికగా కూడా అదానీ గ్రూప్‌కి వ్యతిరేకంగా నిరసన పిలుపునిచ్చారు. ఈ మేరకు నిరసకారలు మాట్లాడుతూ..."మేము పునరుత్పాధకతను వ్యతిరేకించడం లేదని స్థిరమైన పర్యావరణం కోసం పాటుపడుతున్నాం . ఇంధన ప్రాజెక్టుల పోటీ బిడ్డింగ్‌ కోరుకుంటున్నాం. ఇప్పటికే ఉన్న చట్టవిరుద్ధ కార్యకలాపాలు, ప్రాజెక్టుల కారణంగా మా దేశ సహజ నిల్వలు క్షీణిస్తున్నాయి. పైగా పర్యావరణానికి ముప్పు కలిగించే చీకటి ఒప్పందాలను మేము అనుమతించలేం. ప్రస్తుతం శ్రీలంక ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, దానికి కచ్చితమైన పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాం.  కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ అవినీతికి మాత్రం తావివ్వం అని నిరసనకారులు నొక్కి చెప్పారు".

ఈ క్రమంలో అదానీ గ్రూప్‌ ప్రతినిధి మాట్లాడుతూ..."శ్రీలంకలో పెట్టుబడుల పెట్టడంతో మా ఉద్దేశం పొరుగు దేశ అవసరాలను తీర్చడమే కాకుండా బాధ్యతాయుతమైన కార్పొరేటర్‌గా ఇరు దేశాల మధ్య భాగస్వామ్య సంబంధాలు పెంపొందింప చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేశాం. అయినా ఈ సమస్య శ్రీలంక పార్లమెంట్‌లోనే పరిష్కరింపబడినప్పటికీ... ఇది ఒక పెను వివాదంగా మారడం మమల్ని చాలా నిరాశకు గురిచేసింది." అని చెప్పారు. ఐతే ఈ ఆరోపణలపై భారత్‌ స్పందించకపోవడం గమనార్హం. 

(చదవండి: సారీ.. ఏదో భావోద్వేగంలో భారత ప్రధాని పేరు చెప్పా!. ఆరోపణల్లో నిజం లేదు)

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)