amp pages | Sakshi

ప్రపంచంలోనే సన్న భవనం

Published on Wed, 04/27/2022 - 05:04

ప్రపంచంలోని అతి పొడవైన భవనం ఏది అనగానే టక్కున బుర్జ్‌ ఖలీఫా అంటారు. మరి ప్రపంచంలోని అతి సన్నని, ఎత్తైన భవనం ఎక్కడుందో, దాని పేరేంటో తెలుసా? న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లో నిర్మించిన ‘స్టెయిన్‌వే టవర్‌’. దీని వెడల్పు కేవలం 17.5 మీటర్లు. ఎత్తేమో 435 మీటర్లు. అంటే ఎత్తుకు వెడల్పుకు ఉన్న నిష్పత్తి 25:1. అదే 828 మీటర్లున్న బుర్జ్‌ ఖలీఫా వెడల్పు 45 మీటర్లు. ఈ సన్నని స్టెయిన్‌వే టవర్‌లో మొత్తం 82 అంతస్తులు, 60 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి.

ఒక్కో అపార్ట్‌మెంట్‌ ధర దాదాపు రూ. 60 కోట్లు. ఇక పెంట్‌ హౌస్‌ ధరైతే ఏకంగా రూ. 500 కోట్లపైనే. ఈ సన్నని భవనంను న్యూయార్క్‌ ఆర్కిటెక్చర్‌ కంపెనీ ‘షాప్‌’ డిజైన్‌ చేసింది. జేడీఎస్‌ డెవలప్‌మెంట్, ప్రాపర్టీ మార్కెట్స్‌ గ్రూప్‌ అండ్‌ స్ప్రూస్‌ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌ నిర్మించింది. ఈ సన్న భవనంకు దగ్గర్లోనే ప్రపంచంలోనే అతి పొడవైన  నివాస భవనం ‘సెంట్రల్‌ పార్క్‌ టవర్‌’ (దీని ఎత్తు 472 మీటర్లు) ఉంది.  
– సాక్షి, సెంట్రల్‌డెస్క్‌

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌