amp pages | Sakshi

ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుంది.. వచ్చేసింది

Published on Tue, 02/02/2021 - 09:04

యాష్గబట్: కుక్కలకుండే విశ్వాసం మనుషులకు కూడా ఉండదని..చాలామంది కుక్కలను ఎంతో అపురూపంగా పెంచుకుంటుంటారు. కుక్కలను అమితంగా ఇష్టపడే వారిలో తుర్క్‌మెనిస్థాన్‌ దేశాధినేత గుర్బంగులి బెర్డిముఖమెదోవ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఈయనకు సెంట్రల్‌ ఆసియాలో నివసించే ‘అలబాయ్‌’ అనే అరుదైన జాతి కుక్కలంటే చాలా ఇష్టం. అందుకే ఈ జాతి కుక్కల స్మృతిగా శునక విగ్రహాన్ని బంగారంతో చేయించి దేశ రాజధాని యాష్గబట్‌లోని ప్రధాన కూడలిలో ప్రతిష్టించారు. తాజాగా ఆయన మరో అడుగు ముందుకేసి.. వార్తల్లో నిలిచారు. అలబాయ్‌ జాతి కుక్కల గౌరవార్థం ఏప్రిల్‌ చివరి ఆదివారాన్ని ‘నేషనల్‌ హాలిడే’గా ప్రకటించారు. ఇదేరోజు స్థానిక గుర్రపు జాతిని స్మరించుకోవడంతోపాటు అలబాయ్‌ డేను కూడా ఘనంగా జరుపుకోవచ్చని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అంతేగాక ఆరోజు డాగ్‌ బ్యూటీ అండ్‌ అగ్లీ కాంటెస్ట్‌లు నిర్వహిద్దామని గుర్బగులి పేర్కొన్నారు. 

అత్యంత ప్రాచుర్యం పొందిన జాతులలో ఒకటైన అలబాయ్‌ శునకం.. రష్యాతోపాటు, ఇతర మధ్య ఆసియా దేశాలలో కనిపిస్తుంది. తుర్క్‌మెనిస్థాన్‌లోనే కాకుండా పొరుగు దేశాల్లోనూ శునకాలను, గుర్రాలను గౌరవించే సంప్రదాయం ఉంది. వాళ్లు తమ పశుసంపదతోపాటు వీటిని కూడా ప్రేమతో పెంచుకుంటారు. తుర్క్‌మెనిస్థాన్‌ అధ్యక్షుడు గుర్బంగులి జాతి కుక్కల మీద ఓ పాట రాయడంతోపాటు ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించారు. అంతేగాక 2017లో గుర్బంగులి అలబాయ్‌ శునకాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు బహూకరించారు. 
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)