amp pages | Sakshi

ఎడతెరిపి లేని యుద్ధం చైనాను కలవరపెడుతోంది!

Published on Thu, 04/07/2022 - 13:11

China Must Be Concerned About The Efficacy: ఉక్రెయిన్‌ పై రష్యా గత నెల రోజులకు పైగా సుదీర్ఘంగా దాడులు కొనసాగిస్తూనే ఉంది. రష్యా కైవ్‌ని స్వాధీనం చేసుకుని విజయ కేతనం ఎగురవేస్తుందోనని అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ టెన్షన్‌గా ఎదురు చూస్తున్నాడు. పుతిన్‌ కల నెరవేర్చేలా రష్యా బలగాలు ఉక్రెయిన్‌ పై యుద్ధ వ్యూహాంతో, వివిధ ప్రణాళికలతో దూసుకుపోతున్నాయి.

ఒక రకంగా ఉక్రెయిన్‌ స్వాధీనం చేసుకునే క్రమంలో  పుతిన్‌ ఆందోళ చెందుతుంటే మరోవైపు ఈ యుద్ధం ఎ‍పట్టికీ ముగిస్తుందో తెలియక చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆందోళన చెందుతున్నాడు. ఒక వేళ యుద్ధంలో రష్యా గెలిస్తే గనుక చైనా కమ్యూనిస్ట్‌ భావజాలానికి అనుకున్నట్లుగా పనిచేస్తుంది. ఒక వేళ యుద్ధంలో రష్యా ఓడిపోతే గనుక చైనా అగ్రరాజ్యం, పాశ్చాత్య దేశాల ఆగ్రహాన్ని ఎదుర్కొవల్సి ఉంటుంది.

చైనాను కలవర పెడుతున్న అంశాలు..

  • చైనా ప్రపంచంలోనే అగ్రగామి వ్యాపారి. ఉక్రెయిన్‌లో సుదీర్ఘ యుద్ధం కారణంగా ‍ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విస్తృతమైన చైనా వాణిజ్యంపై ప్రభావం చూపింది.
  • చైనా కూడా భారత్‌లా  హైడ్రోకార్బన్ వంటి ఇంధనాల దిగుమతి కోసం వేరే దేశాల పై ఆధారపడుతోంది. అదీగాక ఈ యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఏర్పడింది. ఇది చైనా ఆర్థిక వ్యవస్థ పై మరింత తీవ్ర ప్రభావం  చూపింది.
  • నాటో వ్యూహాత్మక మద్దతుతో ఉక్రెయిన్‌ రష్యాతో చేస్తున్న పోరాటం తైవాన్ పై దాడికి దిగాలనుకున్న​ చైనా ఆలోచనను సందిగ్ధంలోకి నెట్టింది. ఒక వేళ చైనా తైవాన్‌తో యుద్ధానికి దిగినట్లయితే యూఎస్‌ దాని మిత్ర దేశాలు ఆ దాడిని తిప్పికొట్టేలా సైనిక సాయం చేస్తాయని చైనాకి పరోక్షంగానే అవగతమైంది.
  • భారత్‌ వలే చైనా కూడా రష్యా నుంచే ఆయుధాలను కొనుగోలుచేస్తోంది. 2012లో ప్రెసిడెంట్ జీ జిన్‌పింగ్ చైనా పగ్గాలు చేపట్టినప్పుడు, తన తోటి కమ్యూనిస్టులతో తన తొలి రహస్య ప్రసంగంలో సోవియట్ యూనియన్ పతనం, విచ్ఛిన్నం గురించి విశ్లేషించి, దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలని చెప్పడం గమనార్హం. ఈ ఏడాది బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో హద్దులు లేని స్నేహం చేస్తానని ప్రమాణం చేశారు.  రష్యా ఓడిపోవడం కమ్యూనిస్ట్ నిరంకుశ పాలనలకు మంచిది కాదు.
  • యుద్ధం జరుగుతున్న తీరు చూస్తే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను రోజురోజుకూ రాజకీయంగా బలహీనపడుతున్నట్లు తెలుస్తోంది. అదీగాక ఆర్థికపరంగా సైనిక మద్దతు కోసం చైనాపై మరింత ఆధారపడేలా చేస్తోంది. చైనాపై రష్యా ఆధారపడటం వలన భారత్‌కి భవిష్యత్తులో రష్యాతో గల సంబంధాల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
  • ఒక వేళ సీన్‌ రివర్స్‌ అయ్యి...ఉక్రెయిన్‌ గెలిచి ..మాస్కో పాలనలో మార్పు వచ్చి..పాశ్చాత్య అనుకూల నాయకుడు అధికారంలో వస్తే గనుక చైనా పై యూఎస్‌​ దాని మిత్ర దేశాలు విరుచుకుపడతాయనడంలో సందేహం లేదు.  
  • ఏది ఏమైన చైనా, రష్యా నాయకులు ఇద్దరూ కూడా 2035 వరకు జీవితకాల నాయకులుగా కొనసాగనుండటం విశేషం.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌