amp pages | Sakshi

బాలికలను స్కూళ్లకు అనుమతించండి...తాలిబన్లను ఆదేశించిన యూఎన్‌

Published on Mon, 03/28/2022 - 12:21

Taliban on allowing girls in high schools: గతేడాది అఫ్గనిస్తాన్‌ని స్వాధీనం చేసుకుని తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  ఆ తర్వాత బాలికలను పాఠశాలలకు వెళ్లకుండా నిషేధిస్తూ తాలిబాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ విషయమై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్సీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు యూఎన్‌ఎస్సీ సభ్యుల ఈ విషయమై అఫ్గనిస్తాన్‌కి సంబంధించిన సెక్రటరీ జనరల్‌ ప్రత్యేక ప్రతినిధి డెబోరా లియోనన్స్‌తో చర్చించారు.

ఆ సమావేశలో బాలికలతో సహా అఫ్గాన్‌లందరి విద్యా హక్కు గురించి పునరుద్ఘాటించారు. విద్యా హక్కును గౌరవించడమే కాకుండా విద్యార్థులందరూ పాఠశాలకు వెళ్లేలా స్కూళ్లు తెరవాలని తాలిబన్లకు పిలుపునిచ్చారు. అఫ్గనిస్తాన్  ఐక్యరాజ్యసమితి సహాయ మిషన్ (యూఎన్‌ఏఎంఏ) , ఈ సమస్యపై సంబంధిత అఫ్గాన్ వాటాదారులందరితో పరస్పర చర్చ కొనసాగించాలని సెక్రటరీ జనరల్‌ ప్రత్యేక ప్రతినిధిని ఆదేశించింది. అంతేగాదు ఈ అంశం పురోగతిపై భద్రతా మండలికి తెలియజేయాలని కూడా కోరింది. విద్యతో సహా అన్ని అంశాల్లో అఫ్గనిస్తాన్‌కు మద్దతు ఇవ్వడానికి అంతర్జాతీయ సమాజం చేస్తున్న ప్రయత్నాల ప్రాముఖ్యతను భద్రతా మండలి సభ్యులు నొక్కి చెప్పారు.

అయితే గతేడాది అఫ్గనిస్తాన్‌లోని వేలాది మంది సెకండరీ పాఠశాల బాలికలు ఆగస్టు 2021 తర్వాత మొదటిసారి తరగతులకు హాజరు కావడానికి ఆసక్తి కనబర్చారు. కానీ కొన్ని గంటల్లోనే పాఠశాలలను మూసివేయాలని తాలిబన్లు ఆదేశాలు జారీ చేశారు. అంతేగాదు తాలిబాన్ ప్రభుత్వం తన తదుపరి నిర్ణయాన్ని ప్రకటించే వరకు బాలికలు ఇంట్లోనే ఉండాలని సూచించారు కూడా. ఒక వారంలోగా బాలికల మాధ్యమిక పాఠశాలలను తిరిగి తెరవడంలో తాలిబాన్ విఫలమైతే దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతామని అప్గాన్‌లోని మహిళా హక్కుల కార్యకర్తలు హెచ్చరించారు.

ఇదిలా ఉండగా రాజధాని నగరం కాబూల్‌లో విద్యార్థినిలు విద్య మన సంపూర్ణ హక్కు అని నినాదాలు చేశారు. అయితే ఈ విషయమై తాలిబానీ విద్యా మంత్రిత్వ శాఖ పూర్తి వివరణ ఇవ్వలేదు. కానీ ఇస్లామిక్ ఎమిరేట్ సీనియర్ నాయకుడు  మాత్రం పాఠశాలలను తిరిగి తెరవడానికి ముందు కొన్ని ఆచరణాత్మక సమస్యలను ఇంకా పరిష్కరించాల్సి ఉందని చెప్పారు.

(చదవండి: రష్యా బలగాల ఉపసంహరణ దిశగా వ్యూహం.. భయాందోళనలో ఉక్రెయిన్‌)

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)