amp pages | Sakshi

ఒక్క డాలర్‌ కోసం జైలు పాలయ్యాడు.. అదీ భార్య వల్ల!

Published on Wed, 12/21/2022 - 15:39

వాషింగ్టన్‌: భార్య చెప్పిన విషయం విని కోపంతో ఊగిపోయిన ఓ భర్త ఒక్క డాలర్‌ కోసం దొంగతనం చేశాడు. తీరా అరెస్టై జైలుకెళ్లాడు. ఈ సంఘటన అమెరికాలోని ఒక్లాహోమా నగరంలో జరిగింది. స్టార్‌బక్స్‌ అనే కాఫీ స్టోర్‌ తన భార్యకు రీఫండ్‌ చేయాల్సిన 1.25 డాలర్లు తిరిగి ఇవ్వలేదనే కోపంతో స్టోర్‌లో చోరీకి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేయాల్సి వచ్చింది. అయితే, ఇక్కడే ట్విస్ట్‌ ఉంది. చోరీ చేసిన వస్తువు విలువ 1.32 డాలర్లు మాత్రమే.  ఆ స్టోరీ ఏంటో మనమూ తెలుసుకుందాం.. 

రిచర్డ్‌ ఎంగెల్‌(61) అనే వ్యక్తి తన భార్యతో  కలిసి గత ఆదివారం సాయంత్రం ఎడ్‌మోండ్‌లోని ఈస్ట్‌ మెమోరియల్‌ రోడ్‌లో ఉన్న స్టార్‌బక్స్‌ కాఫీ స్టోర్‌కు వెళ్లాడు. ఆ మరుసటి రోజు ఆయన భార్య తిరిగి కాఫీ షాప్‌కి వెళ్లి తనకు రీఫండ్‌ చేయాల్సిన 1.25 డాలర్లు తిరిగి ఇవ్వాలని కోరింది. అయితే, కాఫీ కొనుగోలు చేసినట్లు రిసిప్ట్ లాంటి ఆధారం లేకుండా రీఫండ్‌ ఇవ్వడం కుదరదని స్టోర్‌ సిబ్బంది తెలిపారు. దీంతో ఇంటికి వెళ్లి తన భర్తను తీసుకొచ్చింది ఆమె. ఈ క్రమంలో క్యాషియర్‌తో గొడవ పడ్డాడు ఎంగెల్‌. తన భార్యకు రావాల్సిన రీఫండ్‌ను ఇవ్వాల్సిందేనని వాధించాడు. క్యాషియర్‌ అందుకు ఒప్పుకోకపోవడంతో కౌంటర్‌పై ఉ‍న్న టిప్‌ జార్‌ను పట్టుకుని అక్కడి నుంచి పరుగులు పెట్టాడు ఎంగెల్‌. అయితే, ఆ టిప్‌ జార్‌లో కేవలం 1.32 డాలర్లు మాత్రమే ఉండటం గమనార్హం. 

ఎంగెల్‌ను అనుసరించిన స్టోర్‌ సిబ్బంది అతడి కారును ఫోటోలు తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారు నంబర్‌ ప్లేట్‌ ఆధారంగా ఎంగెల్‌ ఇంటికి వెళ్లి చోరీ, దాడి వంటి నేరాల కింద అరెస్ట్‌ చేశారు పోలీసులు.

ఇదీ చదవండి: దురదృష్టవశాత్తు ఆ ఫ్లైట్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్నా..! 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)