amp pages | Sakshi

పొదలమాటున నక్కి.. ఒక్క ఉదుటున మొసలిపై దూకి..వాట్‌ ఏ పవర్‌

Published on Thu, 08/18/2022 - 16:41

అడవి నియమాలు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ  బతకాలంటే బలంతోపాటు వేట సాగించాల్సిందే. జాలి దయ లాంటివి అస్సలు ఉండవు. ఒక జంతువు ఆకలికి మరో ప్రాణి బలి కావాల్సిందే. ఇక సింహం, పులి, చిరుత లాంటి క్రూర మృగాలు వాటికి ఏ జంతువు న‌చ్చితే వాటిని వేటాడి త‌మకు ఆహారంగా మార్చేసుకుంటాయి. తాజాగా సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న వీడియో సరిగ్గా ఇదే విషయాన్ని తెలియజేస్తుంది. 

ఓ జాగ్వార్‌(చిరుతపులి) నదిలోకి దూకి మొసలిని వేటాడి ఆహారంగా మలుచుకుంది. ముందుగా చెట్టు పొదల్లో నక్కిన చిరుతపులి మెల్లగా నది ఒడ్డుకు వచ్చింది. తర్వాత  నీటిలో తేలియాడుతున్న మొసలిపై ఒక్క ఉదుటున దూకి భయంకరంగా దాడి చేసింది. వెంటనే దాని దవడలతో మొసలి మెడ భాగంలో కరిచి పట్టుకొని నది నుంచి బయటకు లాక్కెళ్లింది. అయితే చిరుత నుంచి తప్పించుకోవడానికి మొసలి ఎంత పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరికి పైచేయి జాగ్వార్‌దే అయ్యింది.

ఈ వీడియోను ఫిగెన్‌ అనే వ్యక్తి తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు. వాస్తవానికి ఈ వీడియోను రెండేళ్ల కిందటే వాహ్సీ హయత్లార్‌ అనే వ్యక్తి  షేర్‌ చేయగా.. ప్రస్తుతం మరోసారి నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే ఇది ఎక్కడ జరిగిందో మాత్రం తెలియరాలేదు. 42 సెకన్ల నిడివిగల ఈ వీడియోను ఇప్పటి వరకు 2.6 మిలియన్ల మంది వీక్షించారు. 27 లైక్‌లు వచ్చాయి.‘ జాగ్వార్‌ దవడలు చాలా దృడంగా ఉంటాయి. చిరుతపులి చాలా ఆకలిగా ఉన్నట్లు ఉంది. ఓ దేవుడా జాగ్వార్‌కు ఎంత శక్తి ఉంది’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.
చదవండి: పాపం! సహోద్యోగి గట్టిగా కౌగిలించుకున్నాడని కోర్టుకెక్కిన మహిళ..

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)