amp pages | Sakshi

బాస్‌ను చితక్కొట్టిన మహిళ, కారణం తెలిస్తే శభాష్‌ అనాల్సిందే!

Published on Fri, 04/16/2021 - 20:51

బీజింగ్‌: పని ప్రదేశాలలో మహిళలను వేధించకూడదని ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కొంత మంది దుర్మార్గులు మారడం లేదు. వారు తమ కింద పనిచేసే మహిళలకు అసభ్యకర సందేశాలు పంపుతూ పైశాచికానందాన్ని పోందుతుంటారు. అయితే ఆడదాన్ని అలుసుగా చూసి అసభ్య సందేశాలు పంపితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో చూపించిందో మహిళ. చైనాలోని ఓ ప్రభుత్వ కార్యాలయ అధికారి వాంగ్‌ ఆ ఆఫీస్‌లో స్వీపర్‌గా పనిచేసే మహిళతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఆమెనే కాకుండా.. ఆఫీసులోని చాలా మంది మహిళలతోను ఇలానే ప్రవర్తించేవాడు.

అతని బాధలు పడలేక అక్కడి నుంచి చాలా మంది మహిళలు వేరే ఉద్యోగాలకు మారిపోయేవారు. ఒకరోజు వాంగ్‌ ... జో అనే మహిళకు అసభ్య సందేశాలు, అశ్లీల ఫొటోలు పంపించాడు. అయితే.. మొదట్లో ఉద్యోగం కోసం ఉరుకున్నా, వేధింపులు మరీ ఎక్కువ కావడంతో ఆమె ఉగ్ర అవతారమెత్తి ఆ బాస్‌పై తిరగబడింది. తన సహచరులతో కలసి అతని క్యాబిన్‌కు వెళ్లింది. నేలను తుడిచే గుడ్డ కర్రతో అతడిని చితక్కొట్టింది.  దీన్ని తోటి ఉద్యోగులు వీడియో తీశారు. ఇప్పుడది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆమె చేసిన ధైర్యానికి తోటి ఉద్యోగులు అభినందిస్తున్నారు. దీన్ని చూసిన నెటిజన్లు హ్యట్సాఫ్‌.. బాగా బుధ్దిచెప్పావంటూ కామెంట్లు పెడుతున్నారు.  ఈ ఘటన తర్వాత అక్కడి ప్రభుత్వం ఆ ఉద్యోగిని విధుల నుంచి తోలగించడమే కాక అతనిపై చర్యలు తీసుకుంది.

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)