amp pages | Sakshi

వైరల్‌: వాటిని తినకుండా 17 ఏళ్లు దాచింది!

Published on Sat, 03/20/2021 - 19:21

వాషింగ్టన్‌ : మనం తినడానికి ఏదైనా కొంటే ఏం చేస్తాం?.. వాటిని మర్చిపోకుండా.. వీలైనంత తొందరగా తినేస్తాం. కానీ, వాటిని అల్మారాలో దాచిపెట్టి ప్రతిరోజూ వాటివంక చూస్తూ కూర్చోం. అయితే, ఓ మహిళ మాత్రం తినడానికి తెచ్చుకున్న బర్గర్‌, ఫ్రైస్‌లను తినకుండా కొన్నేళ్ల పాటు దాచిపెట్టింది. తాజాగా వాటిని బయటకు తీసి టిక్‌టాక్‌ సెలెబ్రిటీ అయిపోయింది. వివరాలు.. అమెరికాకు చెందిన ఓ మహిళ 2004లో మెక్‌డొనాల్డ్‌ చీజ్‌ బర్గర్‌, ఫ్రైస్‌ కొని ఇంటికి తెచ్చుకుంది. అయితే వాటిని తినకుండా.. పైన కవరు కూడా తీయకుండా అట్టే దాచిపెట్టింది. అలా ఒకటి కాదు రెండు కాదు! ఏకంగా 17 ఏళ్లు దాచింది. ఆమెతో పాటు ఇతరులు కూడా వాటి పరిస్థితి ఎలా ఉందో చూడడానికి తెగ ఆసక్తి చూపేవారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఆమె వాటిని తెరిచి చూడటానికి నిశ్చయించుకుంది.

వాటిని కవరులోంచి బయటకు తీసింది. బర్గర్‌ బాగా ముడుచుకుపోయి గట్టిగా తయారయింది. లోపలి పదార్ధం పీనట్‌ బటర్‌ను తలపిస్తోంది. ఇక, ఫ్రైస్‌ తాజాగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఆమె కూతురు సవానా వైట్‌హెడ్‌ ఈ దృశ్యాలను వీడియో తీసి తన టిక్‌టాక్‌ ఖాతాలో షేర్‌ చేయగా వైరల్‌ అయింది. ఇప్పటివరకు 7 లక్షలకు పైగా వ్యూస్‌ సంపాదించింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు ‘‘ ఆ ఆహారానికి నా అంత వయసుంది’’.. ‘‘ ఇంకా నయం వాటిని తింటాననలేదు’’.. ‘‘ ఓల్డ్‌ను గోల్డ్‌ చేశారు కదు తల్లీ’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి : హఠాత్తుగా అమ్మాయి 50 ఏళ్ల మగాడిగా మారింది!

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌