amp pages | Sakshi

2100 నాటికి ప్రపంచ జనాభాలో భారీ తగ్గుదల? భారత్‌, చైనా పరిస్థితి ఏమిటి?

Published on Thu, 11/09/2023 - 11:58

పెరుగుతున్న జనాభాపై ప్రపంచంలోని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా పెరుగుదల అనేక అనర్థాలకు దారితీస్తుందని వాపోతున్నాయి. అయితే ఐక్యరాజ్యసమితి అందించిన ‘రివిజన్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ -2022’ డేటాలోని వివరాలు మన ఊహలకు భిన్నంగా ఉన్నాయి. భవిష్యత్‌లో ప్రపంచ జనాభాలో తగ్గుదల కనిపించనున్నదని ఈ నివేదిక వెల్లడించింది. దీనికి వెనుకనున్న కారణాలేమిటో కూడా తెలియజేసింది.  

ప్రపంచంలో 2100 నాటికి మొత్తం జనాభా ఎంత ఉంటుందనే దానిపై ఈ నివేదికలో అంచనా అందించారు. దీనిలో భారతదేశంతో పాటు చైనా, పాకిస్తాన్, అమెరికా, యూరోపియన్ దేశాల జనాభాకు సంబంధించి అంచనాలున్నాయి. ఈ నివేదికలోని వివరాల ప్రకారం 2021లో భారతదేశ జనాభా 153 కోట్లు. ప్రస్తుత జనాభా దాదాపు 140 కోట్లు. అంటే 2021కి.. ఇప్పటికి(2023) జనాభాలో తగ్గుదల కనిపించింది. దీని ‍ప్రకారం చూస్తే వచ్చే 77 ఏళ్లలో అంటే 2100 నాటికి భారతదేశ జనాభా 13 కోట్ల మేరకు మాత్రమే పెరగనుంది.

2100వ సంవత్సరంలో ప్రపంచ జనాభాలో గణనీయమైన పెరుగుదల ఉండకపోవచ్చంటూ ఈ అంచనాలలో పేర్కొన్నారు. ఈ నివేదికలో అత్యంత ఆశ్చర్యకరమైన అంశం చైనాతో ముడిపడివుంది. 2100 నాటికి చైనా జనాభా 140 కోట్ల నుంచి దాదాపు 77 కోట్లకు తగ్గిపోనుంది. యూఎన్‌ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్‌ఎంఈ), ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్స్ అనాలిసిస్ (ఐఐఏఎస్‌ఏ)లు అందించిన డేటాలలోని అంశాలను క్రోడీకరించి 2100నాటి జనాభా అంచనాలను రూపొందించారు. 

ప్రపంచ జనాభా 2086 నాటికి  గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఆ నివేదికలో పేర్కొన్నారు. సంతానోత్పత్తి రేట్లు 2050కి ముందుగానే త్వరితగతిన తగ్గుతాయని ఈ అంచనాలలో వెల్లడయ్యింది. 2100కి వీటి స్థిరీకరణ జరగనుందని పేర్కొన్నారు. దేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు జనన రేటు తగ్గుతుంది. శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం పెరగడం, గర్భనిరోధకాల లభ్యత, కుటుంబ నియంత్రణకు ప్రోత్సాహం, అధిక సంతాన ఖర్చులు మొదలైనవి సంతానోత్పత్తి తగ్గుదలకు కారణాలుగా నిలుస్తున్నాయి. 2100 నాటికి వివిధ దేశాల జనాభా ఎంత ఉండవచ్చనే అంచనాలను ‘రివిజన్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ -2022’ డేటాలో అందించారు.

2100 నాటికి ఏ దేశంలో ఎంత జనాభా(అంచనా)?
భారతదేశం: 153 కోట్లు
చైనా: 77 కోట్ల 10 లక్షలు
నైజీరియా: 54 కోట్ల 60 లక్షలు
పాకిస్తాన్: 48 కోట్ల 70 లక్షలు
కాంగో: 43 కోట్ల 10 లక్షలు
అమెరికా: 39 కోట్ల 40 లక్షలు
ఇథియోపియా: 32 కోట్ల 30 లక్షలు
ఇండోనేషియా: 29 కోట్ల 70 లక్షలు
టాంజానియా: 24 కోట్ల 40 లక్షలు
ఈజిప్ట్: 20 కోట్ల 50 లక్షలు
బ్రెజిల్: 18 కోట్ల 50 లక్షలు
ఫిలిప్పీన్స్: 18 కోట్లు
బంగ్లాదేశ్: 17 కోట్ల 70 లక్షలు
సూడాన్: 14 కోట్ల 20 లక్షలు
అంగోలా: 13 కోట్ల 30 లక్షలు
ఉగాండా: 13 కోట్ల 20 లక్షలు
మెక్సికో: 11 కోట్ల 60 లక్షలు
కెన్యా: 11 కోట్ల 30 లక్షలు
రష్యా: 11 కోట్ల 20 లక్షలు
ఇరాక్: 11 కోట్ల 10 లక్షలు
ఆఫ్ఘనిస్తాన్: 11 కోట్లు
మొజాంబిక్: 10 కోట్ల 60 లక్షలు
వియత్నాం: 9 కోట్ల 10 లక్షలు
కామెరూన్: 8 కోట్ల 70 లక్షలు
మాలి: 8 కోట్ల 70 లక్షలు
మడగాస్కర్: 8 కోట్ల 30 లక్షలు
టర్కీ: 8 కోట్ల 20 లక్షలు
ఇరాన్: 7 కోట్ల 90 లక్షలు
దక్షిణాఫ్రికా: 7 కోట్ల 40 లక్షలు
యెమెన్: 7 కోట్ల 40 లక్షలు
జపాన్: 7 కోట్ల 40 లక్షలు
ఇది కూడా చదవండి: చైనా జిత్తులకు అమెరికా, భారత్‌ పైఎత్తు!

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)