amp pages | Sakshi

తొలి హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంట్‌కు 56 ఏళ్లు.. ఆరోజు జరిగిందిదే..

Published on Thu, 06/22/2023 - 09:59

సరిగ్గా 56 ఏళ్ల క్రితం వైద్యచరిత్రలో ఒక అద్భుతం నమోదయ్యింది. 1967 డిసెంబరు 3న ప్రపంచంలో తొలిసారిగా ‘హ్యూమన్‌ హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంట్‌’ జరిగింది. 53 ఏళ్ల లూయీ వష్కాన్స్కీ గుండె స్థానంలో 25 ఏళ్ల డెనిన్‌ గుండెను ట్రాన్స్‌ప్లాంట్‌ చేశారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హృద్రోగ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. యువత కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. గుండెపోటుతో సంభవించే హఠాన్మరణాల సంఖ్య పెరుగుతోంది. హృద్రోగ సమస్యలకు పరిష్కారంగా కొందరికి హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేస్తుంటారు. ప్రపంచంలో తొలిసారిగా గుండె మార్పిడి శస్త్ర చికిత్స 56 ఏళ్ల క్రితం జరిగింది.

1967, డిసెంబరు 3న ప్రపంచంలో తొలిసారిగా జరిగిన ‘హ్యూమన్‌ హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంట్‌’ విజయవంతమయ్యింది. ఇది దక్షిణాఫ్రికా రాజధాని కేప్‌టౌన్‌లోని ‘గ్రూట్ షుర్ హాస్పిటల్’లో జరిగింది. ఈ హృదయ మార్పిడి శస్త్రచికిత్సను డాక్టర్‌ క్రిస్టియన్‌ బర్నార్డ్‌ సారధ్యంలో 30 మంది సభ్యులతో కూడిన వైద్య బృందం నిర్వహించింది. ఈ శస్త్ర చికిత్స నిర్వహణకు 9 గంటల సమయం పట్టింది.

ఈ శస్త్రచికిత్సకు అవసరమైన సాంకేతికతను అమెరికాకు చెందిన సర్జన్‌ నార్మన్‌ అభివృద్ధి చేశారు. దీనికి ముందు తొలి హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ 1958లో ఒక శునకానికి జరిగింది. తొలి హ్యూమన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌లో 53 ఏళ్ల లూయీ గుండె స్థానంలో 25 ఏళ్ల డెనిస్‌ గుండెను అమర్చారు. డెనిస్‌ రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌ డెడ్‌ అయ్యాడు. అతని కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. మనదేశంలో డిల్లీ ఎయిమ్స్‌లో 1994, ఆగస్టు 3న తొలి హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ రామ్‌నాయక్‌ అనే వ్యక్తికి జరిగింది. డాక్టర్‌ పి వేణుగోపాల్‌ సారధ్యంలోనే 20 మంది సర్జన్ల బృందం ఈ శస్త్రచికిత్స నిర్వహణలో పాల్గొంది.

ఇది కూడా చదవండి: ఈ దేశాల్లో జనం పిల్లలను కనడం లేదు!

Videos

ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్

అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?

స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?

మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా

రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే

ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప

సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప

Photos

+5

తాగుడుకు బానిసైన హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)