amp pages | Sakshi

కోడళ్లకు అక్కడ 'నో రేషన్‌కార్డు'..

Published on Mon, 12/25/2023 - 00:56

కరీంనగర్‌: రేషన్‌కార్డుల జారీ ఎటూతేలకపోవడం కోడళ్లకు శాపంగా మారింది. ఇంటిపేరు మారినా రేషన్‌కార్డులో పేరు చేరకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో వేలమంది నిరీక్షిస్తుండగా అధికార యంత్రాంగం సమాధానమివ్వలేని పరిస్థితి. గత అయిదేళ్లుగా దరఖాస్తులు కుప్ప ల్లా పేరుకుపోతుండగా కార్డుల జారీ ప్రశ్నార్థకం. ఇక పేర్ల తొలగింపు ప్రక్రియ నిరంతరం సాగుతుండగా కొత్తకార్డుల జారీలో మాత్రం అలసత్వమే. కార్డుల మంజూరుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని యంత్రాంగం చెబుతుండగా నిరీక్షణ ఇంకెన్నాళ్లన్న అసహనం వ్యక్తమవుతోంది.

‘నగరంలోని గణేశ్‌నగర్‌కు చెందిన కత్తురోజు రమేశ్‌కు ఏడాది క్రితం వివాహమైంది. హుజూరాబాద్‌ నుంచి అఖిలను పెళ్లి చేసుకోగా ఆమెపేరును తల్లిగారింట తొలగించారు. ఈ క్రమంలో కొత్త రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటికీ మంజూరు కాలేదు. ఇది ఒక అఖిల పరిస్థితే కాదు జిల్లావ్యాప్తంగా వేలల్లో ఉన్న కోడళ్లది.'

దరఖాస్తు చేసి ఏళ్లు.. మంజూరుకు ఎన్నేళ్లు
కొత్తకార్డుకు దరఖాస్తు చేసి ఏళ్లు గడుస్తుండగా స్పష్టమైన ప్రకటన లేదని వాపోతున్నారు. తనకు అయిదేళ్ల క్రితం వివాహమైందని, పిల్లలు పుట్టారని అయినా కార్డు మంజూరు కాలేదని చొప్పదండికి చెందిన రాజు వివరించారు. జిల్లాలో 512 రేషన్‌దుకాణాల ద్వారా రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తుండగా 2.70లక్షల కార్డుదారులున్నారు. పెళ్లికాగానే తమ పేరును తొలగించాలని కొందరు యువతులు స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకుంటున్నారు.

వారి పేరు మీద ఉన్న యూనిట్‌ను అధికారులు తొలగిస్తున్నారు. అత్తారింటి కార్డులో పేరు చేర్చే ఆప్షన్‌ లేకపోవడంతో కొందరు తొలగింపునకు ఒప్పుకోవడం లేదు. సదరు కార్డులు అలాగే కొనసాగుతుండగా పలు గ్రామాల్లో పేర్లు తొలగించాలని తహసీల్దార్లకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ మేరకు విచారణ చేసి తొలగిస్తున్నారు. ఈ మూడేళ్లలో జిల్లావ్యాప్తంగా అత్తింటి కార్డులో ఒక్కపేరు చేర్చలేదని తెలుస్తోంది.

ఒక్కో కార్డుకు రూ.25 వసూలు
రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు రేషన్‌కార్డులు పంపిణీ చేయలేదు. గతంలో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కొత్త కార్డులు ముద్రించగా జిల్లాల విభజనతో సదరు కార్డులను మూలనపడేశారు. దీంతో డీలర్లే కార్డులు ముద్రించి లబ్ధిదారుల పేర్లు రాసిస్తున్నారు. ఒక్కోకార్డుకు రూ.25వరకు వసూలు చేస్తున్నారు. కొత్తకార్డులు, పేర్లు చేర్పించేందుకు మీసేవ కేంద్రాల్లో వేలల్లో దరఖాస్తులు పెట్టుకుంటున్నారు.

అధికారులు విచారణచేసి అర్హులకు అనుమతిచ్చి కమిషనరేట్‌ లాగిన్‌కు పంపించారు. ప్రభుత్వ నిర్ణయం వెలువడక మూడేళ్ల నుంచి ముందుకు సాగడం లేదు. అయితే కొత్తకార్డుల జారీపై ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు లేవని, కోడళ్లు తమ పేరును అత్తారింటి కార్డులో చేర్చేందుకు మీసేవలో నమోదు చేసుకోవచ్చని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు.

ఇవి చ‌ద‌వండి: ఇక‌పై ఈ ప్రాంతాల‌కు 'ఆర్ ఆర్ ఆర్‌' (RRR)

Videos

ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్

అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?

స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?

మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా

రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే

ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప

సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప

Photos

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)