amp pages | Sakshi

చిటపటల జోరుకు బ్రేక్‌

Published on Sun, 11/12/2023 - 01:22

బనశంకరి: అత్తిబెలె వద్ద ఇటీవల టపాసుల గోదాములో పేలుడు జరిగి 17 మంది దుర్మరణం చెందడంతో రాష్ట్ర ప్రభుత్వం టపాసుల అమ్మకాలపై కఠిన ఆంక్షలను విధించడం ఈ దీపావళిపై ప్రభావం చూపింది. నగరంలోనే కాదు, రాష్ట్రంలో చాలా చోట్ల టపాసులు వ్యాపార కార్యకలాపాలు తక్కువగా ఉన్నాయి. దశాబ్దాలుగా కూడళ్లు, వాణిజ్య సముదాయాల్లో నడుస్తున్న టపాసులు దుకాణాలను అత్తిబెలె పేలుడు తరువాత అధికారులు మూయించేశారు. 35 రోజుల నుంచి రెవెన్యూ, పోలీసు, ఫైర్‌ అధికారులు ప్రతి షాపును తనిఖీ చేసి లైసెన్స్‌, ఇతర నియమాలను పరిశీలించి అన్నీ బాగున్నప్పటికీ షాపులను తెరవరాదన్నారు. బెంగళూరులోనే 270 స్టాళ్లు మూతపడ్డాయి. దీంతో దీపావళి పండుగకు నెలల ముందే భారీ మొత్తంలో టపాసులు తెప్పించిన దుకాణదారులు, వ్యాపారులు ప్రభుత్వ కఠిన చర్యలతో అవాక్కయ్యారు.

2 గంటలు మాత్రమే కాల్చాలి

ఒక్కో లేఔట్‌లో బహిరంగ మైదానంలో మాత్రమే సామూహిక టపాసుల అంగళ్లకు అనుమతించారు. మరోవైపు టపాసుల వ్యాపారులకు కొనుగోలుదారులు ఫోన్లు చేసి ఇంటికే తెప్పించుకోవడం పెరిగింది. కాగా ఐటీ సిటీతో పాటు రాష్ట్రంలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యనే టపాసులు కాల్చాలని ప్రభుత్వం ప్రకటించింది. ఇన్ని నియమాల మధ్య వ్యాపారులు కూడా ధరలను పెంచేయడంతో సామాన్య ప్రజలు అవస్థలు పడ్డారు.

15 ఏళ్లుగా అమ్మేవాడిని

గత 15 ఏళ్లుగా లైసెస్సు కలిగిన దుకాణం పెట్టుకుని ఏడాదంతా టపాసులు విక్రయించేవాడినని, ఈసారి లైసెన్సు రద్దుచేశారు. నెలక్రితం లక్షలాది రూపాయలుపెట్టుబడి పెట్టి టపాసులు తెప్పించా, ఏం చేయాలో దిక్కుతోచడం లేదు అని బెంగళూరుకి చెందిన టపాసుల వ్యాపారి సీ.రాజా చెప్పారు.

ముందే చెప్పొచ్చు కదా

పటాకుల దుకాణాలను మూసివేయడంతో వందలాది వ్యాపారులు, కార్మికులు వీధిన పడ్డారు. ఇలాంటి కఠిన నిర్ణయాలు పండుగ ముందు కాకుండా కొన్ని నెలల కిందటే చెప్పి ఉంటే వ్యాపారమే చేసేవారం కాదని అత్తిబెలె టపాసులు వ్యాపారి శరవణ అన్నారు. అలాగే టపాసుల అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే కోట్లాది రూపాయల పన్నులు కూడా రాకుండా పోయాయన్నారు.

బెంగళూరు వయ్యాలి కావల్‌లో

టపాసుల విక్రయాలు

కఠిన ఆంక్షలతో అంతటా టపాసుల

షాపులు తగ్గుముఖం

Videos

మేము ఎప్పుడో గెలిచాం..మెజారిటీ కోసం చూస్తున్నాం..

నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్

సర్వే పై సంచలన విషయాలు బయటపెట్టిన కెఎస్ ప్రసాద్..

బూతు అస్త్రం ప్రయోగిస్తున్న బాబు

టీడీపీ నేతకు బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్

నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు

ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఉదాహరణలతో వివరించిన సీఎం జగన్

ఆంధ్రా అతలాకుతలం..

విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం..

ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?