amp pages | Sakshi

‘దీవెన’ జాయింట్‌ అకౌంట్లపై కసరత్తు

Published on Thu, 11/16/2023 - 01:48

చిలకలపూడి(మచిలీపట్నం): జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన పథకాలను మరింత పారదర్శకంగా అమలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటివరకు విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తుండగా, ఇక నుంచి తల్లితో పాటు విద్యార్థి జాయింట్‌ అకౌంట్‌లో జమ కానుంది. ఇందుకోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు.

విద్యా దీవెన లబ్ధిదారులు 34,756 మంది

జిల్లాలో విద్యాదీవెనకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, కాపు, క్రిస్టియన్‌ మైనార్టీకి సంబంధించిన విద్యార్థులు జిల్లాలో 34,756 మంది ఉన్నారు. వసతిదీవెనకు సంబంధించి ఈ వర్గాలవారు 34,280 మంది ఉన్నారు. వీరిలో 18,186 మంది విద్యార్థులకు ఇంకా జాయింట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయాల్సి ఉంది. వీటిలో ఎస్‌బీఐలో 5385, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 5265, ఇండియన్‌ బ్యాంక్‌లో 3834, కెనరా బ్యాంక్‌ 1254, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 418, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 367, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 363 మంది ఇంకా మిగిలిన బ్యాంకుల్లో వారి వ్యక్తిగత ఖాతాలను జాయింట్‌ అకౌంట్లుగా మార్చుకోవాల్సి ఉంది.

లక్ష్యం మేరకు...

జిల్లాలో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పొందుతున్న వారికి ఇప్పటికే వారి తల్లి పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. ఇదే ఖాతాకు విద్యార్థి పేరుతో జాయింట్‌ అకౌంట్‌గా మార్పు చేసేలా సంక్షేమ శాఖల అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం బ్యాంకు అధికారులను సమన్వయం చేసుకునేలా సంక్షేమ శాఖలకు చెందిన అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ద్వారా బ్యాంకు ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరితగతిన జాయింట్‌ ఖాతాలు తెరిచేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఖాతాల్లో ఈ నెల 28న జగనన్న విద్యాదీవెన నగదును ఆ ఖాతాల్లో జమ చేయనున్నారు.

విద్యా, వసతి దీవెన కలిపి మొత్తం

69,036 మంది లబ్ధిదారులు

జాయింట్‌ అకౌంట్‌ ఓపెన్‌

చేయాల్సిన వారు 18,186 మంది

24 లోగా వారితో అకౌంట్లు

ఓపెన్‌ చేయించాలని లక్ష్యం

28న లబ్ధిదారుల ఖాతాల్లో

విద్యాదీవెన నగదు జమ

ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం

విద్యార్థి, తల్లి పేరుతో జాయింట్‌ బ్యాంక్‌ ఖాతాలు తెరిపించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఈ నెల 21 నుంచి 24 వరకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం. జిల్లాలోని ప్రతి కాలేజీకి సంక్షేమాధికారులను బాధ్యులుగా చేసి పర్యవేక్షణ జరుపుతున్నాం.

– షేక్‌ షాహిద్‌బాబు,

సంక్షేమశాఖల సాధికారత అధికారి

Videos

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు

చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"

రాజంపేట లో అశేష ప్రజా స్పందన

కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు

గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు

సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు