amp pages | Sakshi

దాడులు.. ప్రతిదాడులు!

Published on Wed, 03/01/2023 - 02:06

భూపాలపల్లి/భూపాలపల్లి అర్బన్‌/భూపాలపల్లి రూరల్‌: భూపాలపల్లి జిల్లాకేంద్రం రణరంగమైంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకుల దాడులు, ప్రతి దాడులతో ఉదయంనుంచి ఉద్రిక్తత నెలకొంది. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చేపట్టిన హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కటౌట్‌తో మంగళవారం ఉదయం ప్రారంభమైన గొడవ రాత్రి వరకు తారస్థాయికి చేరింది. సభలో రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణులు రాళ్లు, చెప్పులు, కోడిగుడ్లు, టమాటాలతో దాడులు, ప్రతిదాడులు చేసుకున్నాయి. పోలీసులు చేసేది లేక వాహనాల చాటున తల దాచుకునే పరిస్థితి నెలకొంది. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మంగళవారం భూపాలపల్లి పట్టణంలో హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు కాంగ్రెస్‌ నాయకులు ఆయనకు స్వాగతం పలుకుతూ స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించనున్న అంబేడ్కర్‌ చౌరస్తాలో కటౌట్‌ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు అక్కడికి చేరుకొని తమ పార్టీ కటౌట్‌ ఎదుట కాంగ్రెస్‌ కటౌట్‌ ఏర్పాటు చేయవద్దని సూచించారు. ఈ విషయమై ఇరువర్గాల మధ్య మూడు గంటల పాటు మాటల యుద్ధం కొనసాగింది. విషయం తెలుసుకున్న ఇరు పార్టీల స్థానిక నాయకులు సంఘటన స్థలానికి చేరుకోగా గొడవ పెద్దదై తోపులాడుకున్నారు. రెండు వర్గాల నాయకులు బాహాబాహీకి దిగి గల్లలు పట్టుకొని కొట్టుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీచార్జ్‌ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అయినప్పటికీ ఎవ రూ అక్కడినుంచి ఉపక్రమించలేదు. బీఆర్‌ఎస్‌ పార్టీకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారంటూ, ఎమ్మెల్యే గండ్ర డౌన్‌ డౌన్‌, పోలీసులు డౌన్‌ డౌన్‌ అంటూ కాంగ్రెస్‌ శ్రేణులు రాస్తారోకోకు దిగారు. యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు సాగర్‌ సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. పోలీసులు బుజ్జగించడంతో ఇరు పార్టీలు అక్కడినుంచి వెళ్లిపోయాయి.

14 నిమిషాల పాటు రాళ్ల వర్షం..

ఉదయం జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకొని రాత్రి జరగనున్న రేవంత్‌రెడ్డి స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌కు పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. మీటింగ్‌ జరిగే స్థలం పక్కనే ఉన్న ఊర్వశి థియేటర్‌లో ఉన్న బీఆర్‌ఎస్‌ నాయకులు టమాటాలు, కోడిగుడ్లతో రేవంత్‌ మీటింగ్‌పై దాడికి పాల్పడే అవకాశం ఉందని పోలీసులకు సమాచారం అందింది. ముందస్తుగా థియేటర్‌వద్ద సుమారు 50 మంది పోలీసులు బందోబస్తుగా ఉన్నారు. అయినప్పటికీ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతున్న సమయంలో బీఆర్‌ఎస్‌ నాయకులు నినాదాలు చేసుకుంటూ పోలీసులను తోసుకుంటూ బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా లాఠీలతో అడ్డుకున్నారు. రేవంత్‌రెడ్డి ప్రసంగం ప్రారంభం కాగానే బీఆర్‌ఎస్‌ నాయకులు చెప్పులు, టమాటాలు, కోడిగుడ్లు విసిరారు. ఈ విషయాన్ని గమనించిన కాంగ్రెస్‌ నాయకులు ఎవరూ ఊహించని రీతిలో బీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్న థియేటర్‌పైకి రాళ్ల వర్షం కురిపించారు. క్షణక్షణానికి పదుల సంఖ్యలో రాళ్లు వస్తుండటంతో చేసేది లేక థియేటర్‌ ఆవరణలో ఉన్న బీఆర్‌ఎస్‌ నాయకులు, పోలీసులు, వెంటనే లోపలికి వెళ్లిపోయారు. థియేటర్‌ బయట ఉన్న పోలీసులు వాహనాల చాటున తలదాచుకున్నారు. సభకు హాజరైన పాత్రికేయులు, ఇతరులు పరుగులంకించుకున్నారు. సుమారు 14 నిమిషాల పాటు రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో కాటారం ఎస్సై శ్రీనివాస్‌ తలకు గాయమైంది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సై ఎస్పీ సురేందర్‌రెడ్డి పరామర్శించారు.

E§ýl-Ķæ$… -¯]l$…_ ¿¶æ*´ë-ÌS-ç³-ÍÏÌZ E{¨MýS¢™èl òœÏMîSÞ MýSso-sŒæ-™ø Ððl¬§ýl-OÌñæ¯]l Æý‡VýSyýl.. Æó‡Ð]l…™Œæ ºíßæ-Æý‡…-VýS- çÜ¿¶æ §éM> Mö¯]l-Ýë-W…ç³#

టమాటాలు, కోడిగుడ్లు, రాళ్లతో

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ శ్రేణుల దాడి

చేతులెత్తేసి వాహనాల చాటున

తలదాచుకున్న పోలీసులు

దాడిలో ఓ ఎస్సైకి గాయాలు,

పగిలిన థియేటర్‌ అద్దాలు

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)