amp pages | Sakshi

ది బిగ్‌ బుల్‌: ఇలియానా ఫస్ట్ లుక్‌

Published on Tue, 08/18/2020 - 11:57

బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌, నటి ఇలియానా జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది బిగ్‌ బుల్‌’. ఈ సినిమాకి సంబంధించిన హీరోయిన్‌ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను చిత్రం బృందం మంగళవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా హీరో అభిషేక్‌ బచ్చన్‌ మూవీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘ఇది ‘ది బిగ్‌ బుల్‌’ సినిమాలోని ఇలియానా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌. భారత దేశ ఆర్థిక వ్యవస్థలోని నేరాలకు పాల్పడిన ఓ వ్యక్తికి సంబంధించిన కథాంశంతో తెరకెక్కుతున్న క్రైం డ్రామా చిత్రం. త్వరలో ఈ చిత్రం డిస్నీ హాట్ స్టార్‌లో విడుదల కానుంది’ అని క్యాప్షన్‌ జత చేశారు. ఈ ఫస్ట్‌ లుక్‌లో ఇలియానా ముఖంలో తీవ్రమైన ఎక్స్‌ప్రెషన్‌ కలిగి, నల్లని సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్నారు. (చదవండి: న‌టి సెల్ఫీ: అస్స‌లు బాగోలేదంటున్న నెటిజ‌న్లు)

ఇలియానా కూడా ‘ది బిగ్‌ బుల్‌’  సినిమా ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘ఈ సినిమాలో భాగం అయినందుకు చాలా సంతోషపడుతున్నాను’ అని క్యాప్షన్‌ జత చేశారు. ది బిగ్ బుల్ సినిమా అనేక ఆర్థిక నేరాలకు పాల్పడిన ఓ స్టాక్ బ్రోకర్‌కు సంబంధించిన కథతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నికితా దత్తా, సోహుమ్‌ షా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి కూకీ గులాటి దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్‌ దేవ్‌గన్‌, ఆనంద్‌ పండిట్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల డిస్నీ, హాట్‌స్టార్ నిర్వహించిన వర్చువల్ విలేకరుల సమావేశంలో ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేస్తామని చిత్ర  యూనిట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ‘ది బిగ్ బుల్’ సినిమా 80, 90ల్లో ముంబైలో జరిగిన కథ అని అభిషేక్‌ బచ్చన్‌ వెల్లడించారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌