amp pages | Sakshi

అదిగదిగో ఆస్కార్‌... మన తరఫున ‘వైట్‌ టైగర్‌’...

Published on Thu, 04/22/2021 - 22:07

అకాడమీ అవార్డులంటేనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులని సినీ రంగ ప్రముఖులు భావిస్తుంటారు. ప్రతి సంవత్సరం ఆలోచనాత్మకమైన కథలతో పాటుగా ఆకట్టుకునే పాత్రలు సైతం ఈ అవార్డుల రేస్‌లో పోటీపడుతుంటాయి. గత 2002లో లగాన్‌ తరువాత ఈ సంవత్సరం వైట్‌ టైగర్‌ చిత్రం ఆస్కార్‌ 2021లో ఇండియా నుంచి పోటీపడుతోంది. దాదాపు 20 సంవత్సరాల తరువాత ఇండియన్‌ మూవీ పోటీపడుతుండడంతో ఈ సారి అకాడమీ పండుగ మనవారికీ ఆసక్తిగా మారింది. ఈ  ఏప్రిల్‌ 26వ తేదీ ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ స్టార్‌ మూవీస్, స్టార్‌ వరల్డ్‌ ఛానెల్స్‌లో ఈ పురస్కారాల పండుగ ప్రసారమవుతోంది.  అవార్డుల వేడుకలను తిలకించడమే...అవార్డుల వేడుకకు ఇంకా కొద్ది రోజులే మిగిలిన వేళ ఈ అకాడమీ అవార్డులలో పోటీపడుతున్న చిత్రాలను ఓ సారి పరిశీలిస్తే...

ద వైట్‌ టైగర్‌: లగాన్‌ తరువాత ఇండియా నుంచి ఆస్కార్‌కు నామినేట్‌ కాబడ్డ చిత్రమిది. రాజ్‌కుమార్‌ రావు, ప్రియాంక చోప్రా లాంటి తారాగణం  ఉన్న  ఈ చిత్రంలో సామాన్యుని జీవితం ఒడిసిపట్టారు. స్లమ్‌డాగ్‌ మిలియనీర్, పారాసైట్‌ల సమ్మేళనంలా కనిపిస్తుందీ చిత్రం.

 

ద పాధర్‌: ఫ్లోరియన్‌ జెల్లర్‌ ప్లే లీ పీరీ ఆధారంగా తీర్చిదిద్దారు. వయసు మీద పడిన తండ్రి నెమ్మదిగా అన్నీ మరిచిపోతుండటం... ఈ నేపథ్యంలో కనిపించే భావోద్వేగాలు. ఆంథోనీ హోప్కిన్స్‌ ప్రదర్శనకు పరాకాష్ట అనతగ్గ రీతిలో ఉంటుంది.

జుడాస్‌ అండ్‌ ద బ్లాక్‌ మెసయ్య: చారిత్రాత్మక బయోపిక్‌ ఇది. దర్శకత్వం మొదలు, చిత్ర నటీనటుల ఎంపిక, నటన, స్క్రిప్ట్‌... ప్రతిఒక్కటీ అద్భుతమే !


మంక్‌: డేవిడ్‌ ఫించర్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. విశేషమేమిటంటే ఈ చిత్ర స్క్రీన్‌ప్లేను ఆయన తండ్రి జాక్‌ ఫించర్‌ తీర్చిదిద్దడం. ఇటీవలనే ఆయన మరణించారు.


మినారీ: లీ ఇసాక్‌ రచనదర్శకత్వం వహించిన కొరియన్‌ అమెరికన్‌ ఫ్యామిలీ చిత్రమిది.  స్ఫూర్తిదాయక  కుటుంబ కథా చిత్రాలలో ఒకటి. రోజువారీ సగటు అమెరికన్‌ జీవిత గాథను ఇది వెల్లడిస్తుంది.


నోమడ్‌ల్యాండ్: అందాన్ని ఆస్వాదించాలనుకునే వారు తప్పనిసరిగా చూడాల్సిన చిత్రమది. ఓ సంక్షోభంలో అన్నీ కోల్పోయిన  60ఏళ్ల వయసులోని మహిళ జీవిత ప్రయాణాన్ని కళ్లకు కడుతుంది. 


ప్రామిసింగ్‌ యంగ్‌ ఉమెన్‌: ఊహాతీత సంఘటనలతో కూడిన కథనం ఈ చిత్రబలం. ఓ అమ్మాయి జీవితంలో జరిగే అనూహ్య సంఘటనలతో సాగుంది.  అద్భుతమైన అభినయం, దర్శకత్వాల కలయిక ఈ చిత్రం. 


సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌:తన వినికిడి శక్తిని కోల్పోవడం ప్రారంభించిన ఓ హెవీ మెటల్‌ డ్రమ్మర్‌ జీవితంపై దృష్టి సారించిన చిత్రమిది. ఈ సినిమా ఆద్యంతం భావోద్వేగాలతో, వాస్తవికంగా  సాగుతుంది. ఈ సినిమాలో కధానాయకుడు ఫీలయ్యే అనేక భావాలను మనమూ ఫీలయ్యేంతగా మనల్ని లీనం చేసుకుంటుంది. రిజ్‌ అహ్మద్‌ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారు. 


ద ట్రయల్‌ ఆఫ్‌ ద చికాగో: కోర్ట్‌ రూమ్‌లో సంభవించే ఆసక్తికర అంశాలను అద్భుతంగా చిత్రీకరించిన వైనం ఆకట్టుకుంటుంది. కొన్ని దశాబ్ధాల క్రితం 1969లో నిజంగా చికాగోలో జరిగిన ఓ ఉదంతం ఆధారంగా తీసిన చిత్రమిది.  

చదవండి: ఎంత వరకు సమంజసం? మీరే ఆలోచించండి: చిరంజీవి

Videos

మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?