amp pages | Sakshi

60 ఏళ్ల వయసులో నటుడు రెండో పెళ్లి.. వధువు బ్యాక్‌గ్రౌండ్‌ ఇదే

Published on Fri, 05/26/2023 - 11:47

ప్రముఖ నటుడు ఆశిష్‌ విద్యార్థి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, బెంగాలీ సహా సుమారు 11 భాషల్లో 200కి పైగా సినిమాల్లో నటించాడు. టాలీవుడ్‌లో విలన్‌ పాత్రలతో గుర్తింపు పొందిన ఆయన తాజాగా 60ఏళ్ల వయసులో రెండోసారి పెళ్లిబంధంలోకి అడుగుపెట్టాడు. అస్సాంకు చెందిన 33 ఏళ్ల ఫ్యాషన్‌  ఎంటర్‌ప్రెన్యూర్‌ రూపాలి బారువాను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కోల్‌కతాలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది.

అతికొద్ది మంది బంధువులు, కుటుంబసభ్యుల సమక్షంలో రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. వీరి పెళ్లి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ జంటకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సుమారు 20ఏళ్ల క్రితమే ఆశిష్‌ విద్యార్థి నటి శాకుంతల బారువా కుమార్తె రాజోషి బారువాను ప్రేమించి మనువాడారు. వీరికి ఆర్త్‌ విద్యార్థి అనే కుమారుడు ఉన్నాడు.

నటిగా, సింగర్‌గా రాజోషి బారువా పాపులర్‌. అయితే భార్యభర్తల మధ్య కొంతకాలంగా విబేధాలు రావడంతో వీరు విడిపోయారు. ఆ తర్వాత ఫ్యాషన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ రుపాలీతో ఆశీష్‌ విద్యార్థికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి చివరకు పెళ్లిపీటలు ఎక్కేదాకా వచ్చింది. ఈమెకు కోల్‌కతాలో పలు స్టోర్స్‌ ఉన్నట్లు తెలుస్తుంది.

కొంతకాలంగా వీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు రూమర్స్‌ వచ్చినా వాటినే నిజం చేస్తూ పెళ్లి చేసుకున్నారు. రూపాలీని పెళ్లి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, తమ బంధం వెనుక పెద్ద కథే ఉందని, తర్వాత ఎప్పుడైనా చెబుతానంటూ స్వయంగా ఆశిష్‌ విద్యార్థి పేర్కొన్నారు. కాగా 60 ఏళ్ల వయసులో ఆశిష్‌విద్యార్థి రెండో పెళ్లి చేసుకోవడం, అది కూడా ప్రేమ పెళ్లి చేసుకోవడం విశేషం.

దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు కొత్తజంటకు కంగ్రాట్స్‌ అంటూ కామెంట్స్‌ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఈ వయసులో మీకిది అవసరమా? అయినా ప్రేమ గుడ్డిది అంటారు. నిజమేనేమో అంటూ సెటైర్లు వేస్తున్నారు. 


 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)