amp pages | Sakshi

ఖరీదైన కారు కొన్న యువ నటుడు

Published on Mon, 01/25/2021 - 08:26

తాను నటించిన సినిమా విజయవంతం కావడంతో తనకు తానే బహుమతి ఇచ్చుకున్నట్లు యువ నటుడు నిఖిల్‌ సిద్ధార్థ్‌ చెప్పాడు. ఈ సందర్భంగా తాను కొత్తగా కొన్న రేంజ్ రోవర్ స్పోర్ట్స్ ఆటోబయోగ్రఫీ కారు ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. లాక్‌డౌన్‌ వలన కారు కొనడం ఆలస్యమైందని తెలిపాడు. ఈ కారు విలువ దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుంది. ‘హ్యాపీడేస్’ సినిమాతో సినీ పరిశ్రమలోకి వచ్చిన నిఖిల్ ఆ తర్వాత ‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుర్తింపు పొందాడు.

గ‌తేడాది ‘అర్జున్‌ సురవరం’ సినిమా విడుదలై విజయవంతమవడంతో ఈ కారు కొన్నట్లు తెలిపారు. కరోనా వలన కారు కొనుగోలు ఆలస్యమైందని పేర్కొన్నాడు. దీంతోపాటు గతేడాది త‌న ప్రేయ‌సిని పెళ్లాడాడు. ప్ర‌స్తుతం వైవాహిక జీవితం ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక సినిమాలపరంగా చూస్తే నిఖిల్‌ కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయ- 2, గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ‘18 పేజెస్’ అనే సినిమాలు చేస్తున్నాడు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌