నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన స్టార్ హీరో తల్లి.. ఎన్ని కోట్లంటే!
Published on Wed, 05/17/2023 - 13:04
బాలీవుడ్ సీనియర్ నటి నీతూ కపూర్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో విశాలమైన ఫోర్ బీహెచ్‌కే అపార్ట్‌మెంట్‌ను దాదాపు రూ.17.4 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మే 10న రిజిస్టర్ చేసుకున్నారని సమాచారం. కేవలం రిజిస్ట్రేషన్‌కే దాదాపు రూ.1.04 కోట్ల స్టాంప్ డ్యూటీని చెల్లించారు. ప్రస్తుతం పాలి హిల్‌లోని కృష్ణ రాజ్ బంగ్లాలో నివసిస్తున్న నీతు కపూర్ రీసేల్ డీల్‌లో ఈ ఆస్తిని కొనుగోలు చేశారు.
(ఇది చదవండి: ఫస్ట్ డేట్లోనే శృంగారానికి ఓకే: స్టార్ హీరోయిన్)
సూరజ్ సినిమాతో అరంగేట్రం చేసిన నీతూ కపూర్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఆ తర్వాత దీవార్, ఖేల్ ఖేల్ మే, కభీ కభీ, అమర్ అక్బర్ ఆంథోనీ, ధరమ్ వీర్ చిత్రాల్లో నటించారు. కాలా పత్తర్ చిత్రానికి గానూ ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు దక్కింది. 1980లో ఆమె నటుడు రిషి కపూర్‌ను వివాహం చేసుకోగా.. రణబీర్ కపూర్, రిద్దిమా కపూర్ జన్మించారు.
(ఇది చదవండి: 'బంగారం' సినిమాలో చిన్నారి.. ఇంతలా మారిపోయిందేంటీ?)
Tags