amp pages | Sakshi

భారీగా రెమ్యునరేషన్‌ పెంచేసిన ‘గ్యాంగ్‌ లీడర్‌’ బ్యూటీ

Published on Mon, 12/05/2022 - 09:40

పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత నటి ప్రియాంక మోహన్‌కు అతికినట్లు సరిపోతుంది. ఈమె చేసిన చిత్రాలు తక్కువే అయినా పారితోషికం విషయంలో తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ కన్నడ భామ 2019లో మాతృభాషలో కథానాయికగా పరిచయం అయింది. ఆ తర్వాత టాలీవుడ్‌ పిలిచింది. అక్కడ నాని గ్యాంగ్‌ లీడర్, శ్రీకారం చిత్రాలను చకచక చేసేసింది. అవి అంత హిట్టు సాధించకపోయినా కోలీవుడ్‌ నుంచి పిలుపు వచ్చింది.

ఇక్కడే ఈ బ్యూటీకి లక్కు కలిసివచ్చింది. శివ కార్తికేయన్‌తో జతకట్టిన డాక్టర్‌ చిత్రం సక్సెస్‌ అయింది. ఆ వెంటనే సూర్యతో ఎదర్కుమ్‌ తుణిందవన్‌ చిత్రంలో రొమాన్స్‌ చేసే అవకాశం వరించింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా ప్రియాంక మోహన్‌ కెరీర్‌కి ఎలాంటి ఎఫెక్ట్‌ కాకపోవడం విశేషం. ఆ వెంటనే మరోసారి శివ కార్తికేయన్‌ జంటగా డాన్‌ చిత్రంలో నటించి మరో విజయాన్ని అందుకుంది. ఈ సక్సెస్‌ ఈమెకు అన్ని విధాలా మంచి కిక్‌ ఇచ్చిందనే  చెప్పాలి. నటిగా వయసు మూడేళ్లే.

మూడు భాషల్లో ఇప్పటికి చేసిన చిత్రాలు కేవలం అరడజనే.. పారితోషికం మాత్రం భారీ మొత్తంలో పుచ్చుకుంటోందని తాజా సమాచారం. రెండు శతాబ్దాలుగా పలు భాషల్లో నటిస్తూ అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్న త్రిష లాంటి వారు కూడా మొన్నటి వరకు కోటి రూపాయల కంటే తక్కువే పారితోషికాన్ని తీసుకున్నారు. అలాంటిది నటి ప్రియాంక మోహన్‌ క్రేజీ హీరోయిన్లకు సమానంగా కోటి రూపాయలు డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం ఈ జాణ ధనుశ్‌కు జంటగా  కెప్టెన్‌ మిల్లర్, జయం రవి సరసన దర్శకుడు ఎం.రాజేష్‌ తెరకెక్కిస్తున్న చిత్రంలోనూ నటిస్తోంది. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్