amp pages | Sakshi

ఆ ముగ్గురిలో ప్రభాస్‌నే పెళ్లాడతా.. కృతిసనన్‌ షాకింగ్ కామెంట్స్

Published on Sat, 11/26/2022 - 15:07

పాన్ ఇండియా హీరో ప్రభాస్, కృతి సనన్ జంటగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఇది ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ విజువల్ వండర్‌గా సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లో మొదటిసారి ప్రభాస్‌తో నటిస్తోంది భామ‌. దేశవ్యాప్తంగా అభిమానులున్న ప్రభాస్‌తో నటించడం ఆనందంగా ఉందని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిది ముద్దుగుమ్మ. తాజాగా ఈ భామకు సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆదిపురుష్‌ నటి కావడంతోనే కృతిసనన్‌ బాగా ఫేమస్ అయింది. 

(చదవండి: ఆది పురుష్ ఆలస్యానికి అసలు కారణం అదే.. కృతి సనన్ కామెంట్స్ వైరల్)

దీంతో ఆమె గతంలో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. అలాగే ఓ ఇంటర్వ్యూలో ఆమెకు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నతో ముద్దుగుమ్మ షాక్‌కు గురైంది. అవకాశం వస్తే ప్రభాస్‌, టైగర్‌ ష్రాఫ్‌, కార్తిక్‌ ఆర్యన్‌.. ముగ్గురిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? ఎవరితో డేటింగ్‌ చేయాలనుకుంటున్నారు? అలాగే ఫ్లర్ట్‌ కూడా' అంటూ దిమ్మతిరిగే ప్రశ్న అడిగారు. దీనికి కృతి సమాధానమిస్తూ.. 'కార్తిక్‌ ఆర్యన్‌ను ఫ్లర్ట్‌,  టైగర్‌తో డేటింగ్‌. ఇక ప్రభాస్‌తో పెళ్లి' అని నవ్వుతూ సమాధానమిచ్చింది ఆదిపురుష్ భామ.

ప్రస్తుతం ఆమె భేదియా(తోడేలు) ప్రమోషన్స్‌లోనూ ప్రభాస్‌ గురించి కృతిసనన్ మాట్లాడారు. ఆయనే తన అభిమాన నటుడని, షూట్‌ సమయంలో భాషాపరంగా సాయం చేశారని చెప్పారు. రామాయణం ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఆదిపురుష్‌ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా కనిపించగా.. కృతి సీత పాత్రలో మెరవనుంది. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్ చేయనున్నారు. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)