amp pages | Sakshi

ఆదిపురుష్‌లో ఆయ‌నే రావ‌ణుడు

Published on Thu, 09/03/2020 - 12:01

ప్ర‌భాస్ హీరోగా పౌరాణిక నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న చిత్రం "ఆదిపురుష్"‌. ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న‌ ఈ సినిమాలో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌నున్నార‌ని స‌మాచారం. 'మహానటి' కీర్తిసురేశ్  సీత‌గా న‌టిస్తున్నార‌న్న వార్త‌ల‌కు అంతే లేదు. అయితే హీరో ఎక్క‌డుంటే విల‌న్ అక్క‌డుంటాడు. అలాగే ఈ సినిమాలో రాముడు ఉన్నాడంటే రావణుడు కూడా ఉండాల్సిందే కదా! కాబ‌ట్టి విల‌న్ ఎవ‌ర‌నేది చిత్ర‌యూనిట్ గురువారం అధికారికంగా వెల్ల‌డించింది. ప్ర‌భాస్‌తో ఫైట్ చేసేందుకు బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌ను ఖ‌రారు చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ హీరో ఇదివ‌ర‌కే ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తానాజీ చిత్రంలోనూ కీల‌క పాత్ర పోషించారు. (చ‌ద‌వండి: జపాన్‌లో తగ్గని ప్రభాస్‌‌ క్రేజ్‌!)

కాగా విల‌న్ పాత్ర‌ను లంకేశ్‌గా ప‌రిచ‌యం చేస్తూ ప్ర‌త్యేక‌ పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. "ఆదిపురుష్" అని అర్థం వ‌చ్చేలా ఏ అక్ష‌రాన్ని హైలెట్ చేస్తూ మ‌ధ్య‌లో విల్లు ప‌ట్టుకుని గురి చూస్తున్న రాముడు, ప‌క్క‌న హ‌నుమంతుడు, పైన పది త‌ల‌ల రావ‌ణుడు ఉన్నారు. "ఏడు వేల సంవ‌త్స‌రాల క్రితం ప్ర‌పంచంలోనే అత్యంత తెలివైన రాక్ష‌సుడు.." అని ప్ర‌భాస్ రాసుకొచ్చారు. సైఫ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని ప్ర‌భాస్ తెలిపారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యాన‌ర్‌పై భూష‌ణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం హిందీ, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ స‌హా ప‌లు భాష‌ల్లో విడుద‌ల చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం 'రాధే శ్యామ్' చిత్ర షూటింగ్ పూర్తైన త‌ర్వాత ప్ర‌భాస్ ఆదిపురుష్ చిత్రీక‌ర‌ణ ప్రారంభించ‌నున్నారు. (చ‌ద‌వండి: ఆదిపురుష్‌.. జక్కన్న రియాక్షన్‌

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?