amp pages | Sakshi

బెదిరింపులు రావడంతో చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన యాంకర్‌

Published on Tue, 05/25/2021 - 17:53

ఇండియన్‌ ఐడల్‌ 12వ సీజన్‌ మరో వివాదంలో చిక్కుకుంది. గత వారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్‌ ఆదిత్య నారయణ్‌ తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎపిసోడ్‌లో మ్యూజిక్‌ డైరెక్టర్‌ శ్రవన్‌ రాథోడ్‌కు నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సన్నిహితులు, ప్రముఖ గాయకులు  అమిత్‌ కుమార్‌ సను, అనురాధ పౌడ్వాల్‌, రూప్‌ కుమార్‌ రాథోడ్‌ ఈ షోకు అతిథులుగా హజరయ్యారు. ఈ నేపథ్యంలో  హోస్ట్‌ ఆదిత్య, కుమార్‌ సనుతో నిజంగానే మీరు కంటెస్టెంట్స్‌ పర్ఫామెన్స్‌ నచ్చి వారిని ప్రశంసించారా, లేక షో మేకర్స్‌ చెప్తే చేశారా అని షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఇక ఇదే ఎపిసోడ్‌లో కంటెస్టెంట్‌ సవాయ్ భట్, అంజలి గైక్వాడ్‌తో కలిసి ఓ సూపర్‌ హిట్‌ పాటను పాడి వినిపించారు. వీళ్ల పర్ఫార్మెన్స్‌ పూర్తయ్యాక సవాయ్‌ భట్‌కు ఎవరైనా గర్ల్‌ ఫ్రెండ్‌ ఉన్నారా అని గెస్ట్‌ ఒకరు ప్రశ్నించగా లేదు లేదు అని సవాయ్‌ భట్‌ సమాధానం చెప్పాడు. అయితే మరో కంటెస్టెంట్‌ మాత్రం సవావ్‌ భట్‌కు జపనీస్‌ గర్ల్‌ఫ్రెండ్‌ ఉందని, ఆమెతో తరుచూ వీడియో కాల్స్‌లో మాట్లాడుతుంటాడని చెప్పడంతో షోలో నవ్వులు పూశాయి. 

ఇదే విషయంపై యాంకర్‌ ఆదిత్య నారాయణ్‌.. ఎవరా జపనీస్‌ గర్ల్‌ఫ్రెండ్‌ అని ప్రశ్నించగా సవాయ్‌ భట్‌ అదేం లేదు అని దాటవేసే ప్రయత్నం చేయడంతో..నువ్వు ఏం చెబితే అది గుడ్డిగా నమ్మడానికి మేము అలీభగ్‌ నుంచి ఏం రాలేదు అంటూ ఫన్నీగా ఆటపట్టించాడు. అయితే ఇప్పుడు ఈ కామెంట్స్ ఆదిత్య మెడకు చెట్టుకున్నాయి. మహారాష్ట్రలోని అలీభగ్‌ ప్రజలను అవమానించేలా ఆదిత్య వ్యాఖ్యలు ఉన్నాయని మహారాష్ట్ర నవనిర్మాన్ సేన (ఎంఎన్ఎస్) మండిపడింది. వెంటనే అలీభగ్‌ ప్రాంత ప్రజలకు క్షమాపణలు చెప్పకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. దీంతో ఆదిత్య నారాయణ తన తప్పును తెలుసుకొని క్షమాపణలు చెప్పాడు. 'రెండు చేతులు జోడించి వినయపూర్వకంగా మీకు క్షమాపణలు చెబుతున్నాను. ఎవరినీ బాధపెట్టాలన్నది నా ఉద్ధేశం కానే కాదు. అలీభగ్‌ ప్రజలపై నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి. నేను అన్న మాటలు మిమ్మల్ని బాధించి ఉంటే మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను' అని పేర్కొన్నారు. 

చదవండి : ఇండియన్‌ ఐడల్‌ 12: హోస్ట్‌ ఆదిత్య నారాయణ తీరుపై నెటిజన్లు ఫైర్‌
‘పెళ్లైన మగాడి వెంట పడొచ్చా’.. రేఖ ఆన్సర్‌


 

Videos

ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు

అకాల వర్షం..అపార నష్టం

హైదరాబాద్ లో వర్ష బీభత్సం..సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఇచ్చాపురం జనసంద్రం..

పార్టీ పెట్టి పదేళ్ళయింది..ఏం పీకావ్..పవన్ కి ముద్రగడ పంచ్

పేదల నోట్లో మట్టి కొట్టిన సైకో.. రైతులు, విద్యార్థులపై బాబు కుట్ర

"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?