amp pages | Sakshi

రూ. 260 కోట్లతో ప్రైవేట్‌ జెట్‌ కొన్న స్టార్‌ హీరో?

Published on Sun, 10/16/2022 - 19:28

బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ ఓ ప్రైవేట్‌ జెట్‌ సొంతం చేసుకున్నాడంటూ సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌ అవుతోంది. దీని కోసం అతడు అక్షరాలా 260 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఓ జాతీయ మీడియా కథనం అల్లేసింది. ఇది  కాస్తా అక్షయ్‌ కంట పడటంతో అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. 'లయ్యర్‌ లయ్యర్‌.. ప్యాంట్స్‌ ఆన్‌ ఫైర్‌.. మీ చిన్నతనంలో మీరి పద్యం నేర్చుకునే ఉంటారు. కొంతమంది జనాలకు బుద్ధి ఎదగలేదు అనిపిస్తోంది. నా గురించి నోటికొచ్చిన అబద్ధాలు రాసేస్తున్నారు. అయినా అలాంటి వారిని గురించి పట్టించుకోవడమే అనవసరం. కాకపోతే మీకోసం ప్యాంట్స్‌ ఆన్‌ ఫైర్‌ పద్యం అంకితం చేస్తున్నా' అని ట్వీట్‌ చేశాడు.

ఇది చూసిన  అక్షయ్‌ ఫ్యాన్స్‌.. 'చాలా రోజుల తర్వాత మీరు ఫైర్‌ అవడాన్ని చూస్తున్నాం', 'అక్కి సర్‌ ఈరోజు రౌడీ మూడ్‌లో ఉన్నాడు', 'ఇలాంటి వారిని ఊరికే వదిలేయకుండా ఏదో ఒక పనిష్మెంట్‌ ఇవ్వండి' అంటూ కామెంట్లు చేస్తున్నారు. అక్షయ్‌ కుమార్‌ సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది అతడు నటించిన బచ్చన్‌ పాండే, సామ్రాట్‌ పృథ్వీరాజ్‌, రక్షా బంధన్‌ థియేటర్‌లో రిలీజ్‌ కాగా కట్‌పుట్లి ఓటీటీలో విడుదలైంది. అలాగే  అతడు ప్రధాన పాత్రలో నటించిన రామసేతు దీపావళి సందర్భంగా అక్టోబర్‌ 25న విడుదల కాబోతోంది. ఇందులో జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, నూస్రత్‌ భరూచ, సత్యదేవ్‌, నాజర్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)